Telugu NRI Couple Died in US due to Bomb Cyclone: అమెరికాలో కురుస్తున్న దట్టమైన మంచు ఒక ఎన్నారై తెలుగు దంపతులను బలిగొంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ తన భార్య హరిత, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు. న్యూజెర్సీలో కురుస్తున్న బాంబు సైక్లోన్ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఒక ఐస్ లేక్ లో ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ప్రమాదం బారినపడ్డారు. గడ్డ కట్టిన ఒక భారీ ఐస్ క్యూబ్ పై నిలబడి ఫోటోలు తీసుకునే క్రమంలోనే ఐస్ గడ్డ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ముద్దన నారాయణ, హరిత దంపతులు ఐస్ గడ్డపై నుంచి కిందపడి ఐస్ లేక్ లో కింది భాగంలో చిక్కుకుపోయారని తెలుస్తోంది.
ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్ లో హరిత మృతదేహం లభించగా.. నారాయణ మృతదేహం కోసం ఇంకా గాలిస్తున్నారు.
దంపతులు ఇద్దరూ ఫోటోలు తీసుకునేందుకు వెళ్లే క్రమంలో తమ పిల్లలు ఇద్దరినీ ఒడ్డునే వదిలి వెళ్లారు. అదృష్టవశాత్తుగా ఆ ఇద్దరూ ఒడ్డునే ఉండటంతో వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి పిల్లలు ఇద్దరు అనాథలుగా మిగిలిపోవడం బంధుమిత్రులను తీవ్ర కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : Leopard Attacks on Vehicle: వాహనంలో వెళ్తున్న వారిపైకి దూకిన చిరుత.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి : Road Accident: రోడ్డు ప్రమాదంలో మోదీ సోదరునికి, మనవడికి గాయాలు
ఇది కూడా చదవండి : BF.7 Scare: కోవిడ్ కేసుల దృష్ట్యా కొత్త ఏడాదిలో ఈ 8 దేశాలకు ప్రయాణం మానుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook