Buy Maruti Swift @ Rs 2.5 Lakhs: మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న Maruti Swift 2.5 లక్షలకే సొంతం చేసుకోండి

Maruti Swift @ Rs 2.5 Lakhs: కారు కొనాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ధరలు చూస్తే మాత్రం ఆకాశాన్నంటుతుంటాయి. అందుకే చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లపై ఆధారపడుతుంటారు. ఆన్‌లైన్ బిజినెస్ అందుబాటులో వచ్చాక ఇది మరింత విస్తృతమైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2023, 04:19 PM IST
Buy Maruti Swift @ Rs 2.5 Lakhs: మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న Maruti Swift 2.5 లక్షలకే సొంతం చేసుకోండి

Buy Maruti Swift @ Rs 2.5 Lakhs Only: బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లే మంచి ఆప్షన్. ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్స్ వాడుకలో వచ్చాక కార్ల కొనుగోలు, అమ్మకం సులభమైపోయింది. సెకండ్ హ్యాండ్ కార్లలో అత్యధికంగా జనం ఏ కారు ఇష్టపడుతున్నారో తెలుసుకుందాం.

సొంత కారు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కొత్త కారు కొనాలంటే కనీసం 4-5 లక్షలు ఉండాల్సిందే. ఇంత మొత్తం డబ్బులు పెట్టే స్థోమత చాలామందికి ఉండదు. అందుకే సెకండ్ హ్యాండ్ కార్లను ఆశ్రయిస్తుంటారు. సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీనికి తోడు ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులో వచ్చాక మరింత విస్తృతమైంది. సెకండ్ హ్యాండ్ కార్లపై వెలుగుచూసిన ఓ రిపోర్ట్‌లో ఆసక్తి కల్గించే విషయాలు వెల్లడయ్యాయి. జనం ఏయే కార్లంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారనేది తేలింది. 

కార్స్ 24 రిపోర్ట్ ప్రకారం భారతీయ కస్టమర్లు తమకిష్టమైన సెకండ్ హ్యాండ్ కారు ఎంపిక చేసేందుకు కేవలం 3 గంటలే ఆన్‌లైన్‌లో గడుపుతున్నారని తేలింది. అంటే 3 గంటల్లో కస్టమర్లు ఏ కారు కొనాలనే నిర్ణయం తీసేసుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్‌లో మారుతి సుజుకి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో మారుతి స్విఫ్ట్, మారుతి బలేనో కార్లకు ఎక్కువ డిమాండ్ నడుస్తోంది. మారుతి స్విఫ్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కేవలం 2.5 లక్షలకే కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. 

Also Read: Indian Railways: రైల్లో తొలిసారి టాయ్‌లెట్ సౌకర్యం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది

మొదటి త్రైమాసికంలో కార్స్ 24లో కొనుగోలు చేసిన కార్లలో 40 శాతం మారుతి సుజుకి కార్లే ఉన్నాయి. మారుతి సుజుకి తరువాత స్థానంలో హ్యుండయ్, హోండా, రెనో కార్లు ఉంటున్నాయి. లక్నో, పాట్నా, కొచ్చి, సూరత్, చండీగఢ్‌లో 2023 తొలి త్రైమాసికంలో సెకండ్ హ్యాండ్ కార్లకు ఎక్కువ డిమాండ్ కన్పించింది. మెట్రో నగరాల్లో ఢిల్లీలో ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు జరిగింది. ఆ తరువాత బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్ నగరాలున్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్, గ్రాండ్ ఐ10 కార్లు లక్నో, పాట్నాలో ఎక్కువగా విక్రయమయ్యాయి. ఇండియాలో కొనుగోలు చేసిన అతి చౌక కార్లు బెంగళూరులో 1,25 వేలకు మారుతి 800, ఢిల్లీలో 1,32 వేలకు మారుతి ఆల్టో ఉన్నాయి. కార్స్ 24 రిపోర్ట్ ప్రకారం భారతీయులు 10 లక్షలకుపైగా కార్లు విక్రయించారు. 2023 లో కేవలం 90 రోజుల్లో కార్స్ 24 వేదికపై 1250 కోట్ల భారతీయులు వాహనాల క్రయ విక్రయాలు జరిపారు.

Also Read: CNG PNG New Price: బిగ్‌ రిలీఫ్.. గ్యాస్‌ ధరలు తగ్గింపు.. నేటి నుంచే అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News