/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Rajamouli Reacts For Dasara Movie: నాని, కీర్తి సురేష్‌లు జంటగా నటించిన దసరా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే తొంభై కోట్ల గ్రాస్ దాటినట్టుగా తెలుస్తోంది. ఇక రేపటితో ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో జాయిన్ కాబోతోంది. ఈ సినిమాతో నాని రేంజ్ మరింతగా పెరిగింది. మొదటిసారిగా వందకోట్ల సినిమా నాని ఖాతాలో పడింది. ఇప్పుడు ఈ సినిమాను చూసి.. ఇంత గొప్పగా తీసిన శ్రీకాంత్ ఓదెల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమాను తాజాగా దర్శకధీరుడు రాజమౌళి చూశాడు. అనంతరం ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ప్రతీ ఒక్కరి గురించి స్పెషల్‌గా చెబుతూ ట్వీట్ వేశాడు. రాజమౌళి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..

రగ్గ్‌డ్ రా కారెక్టర్ల మధ్య ఇలాంటి సున్నితమైన ప్రేమను చూపించిన శ్రీకాంత్ ఓదెలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. నాని కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. ఇక కీర్తి సురేష్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఎంతో అవలీలగా చేసేసింది.. ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకునేలా నటించారు.. సినిమాటోగ్రఫీ టాప్ ప్లేస్‌లో నిలిచింది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాల్సిందే..ఇంతటి విజయాన్ని దక్కించుకున్న దసరా టీంకు కంగ్రాట్స్ అని రాజమౌళి మెచ్చుకున్నాడు.

రాజమౌళి ట్వీట్ చూసి శ్రీకాంత్ ఓదెల కిందా మీదా పడినట్టున్నాడు. ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియడం లేదు.. అంటూ లవ్ సింబల్స్ షేర్ చేసి దండం పెట్టేశాడు శ్రీకాంత్ ఓదెల. ఇక నాని అయితే ఓ రేంజ్‌లో రిప్లై ఇచ్చాడు. ఇదే మాకు ఆస్కార్ వచ్చినట్టు అని రాజమౌళి రిప్లై ఇచ్చాడు నాని.

కథ విన్నప్పటి నుంచి తనకు ఈ రేంజ్ సక్సెస్ వస్తుందని నాని నమ్మకంతోనే ఉన్నాడట. కథ విన్న వెంటనే ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇవ్వాలని నాని ఫిక్స్ అయ్యాడట. కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా వద్దని అనుకున్నాడట దర్శకుడు. కానీ నాని చెప్పాడని తలూపాడట. ఇప్పుడు సినిమా పూర్తయ్యాక, సినిమా చూశాక.. ఆమె తప్ప ఇంకొకరు ఈ పాత్రను చేయలేరని డైరెక్టర్ దండం పెట్టేశాడట.
Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
Nani Overjoyed On Rajamouli Reacts For Dasara Movie
News Source: 
Home Title: 

Rajamouli Dasara Review : దసరాకు ఆస్కార్ వచ్చినట్టే.. నాని ట్వీట్ వైరల్!

Rajamouli Dasara Review: దసరాకు ఆస్కార్ వచ్చినట్టే.. నాని ట్వీట్ వైరల్!
Caption: 
Rajamouli Review on Nani's Dasara (Source: Instagram)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

బాక్సాఫీస్ వద్ద దసరా సందడి

రాజమౌళి మెచ్చిన దసరా

గాల్లో తేలిపోయిన నేచురల్ స్టార్

Mobile Title: 
Rajamouli Dasara Review: దసరాకు ఆస్కార్ వచ్చినట్టే.. నాని ట్వీట్ వైరల్!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, April 3, 2023 - 17:43
Updated By: 
Ravi Ponnala
Request Count: 
46
Is Breaking News: 
No