Health Tips For Summer: సూర్యకాంతి వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే సూర్యకాంతిలో విటమిన్ డి లోపాన్ని తగ్గించే శక్తి లభిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి పొందడానికి టాబ్లెట్స్‌ను వినియోగిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం..టాబ్లెట్స్‌కు బదులుగా సూర్యకాంతి ద్వార పొందిన విటమిన్ డి శరీరానికి చాలా మంచిది. అయితే దీని వల్ల చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. సూర్యరశ్మి పొందడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సూర్యరశ్మి వల్ల ఈ సమస్యలు దూరమవుతాయి:
1. చర్మ సమస్యలు దూరమవుతాయి:
సాధారణంగా సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ సూర్యరశ్మి శక్తి వల్ల చాలా రకాల చర్మ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యుని UV కిరణాలు శరీరంపై పడడం వల్ల సోరియాసిస్, దురద, కామెర్లు, మొటిమలు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. స్కిన్ ఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యే అనేక బాక్టీరియా కూడా సూర్యరశ్మి తగ్గిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ సూర్యరశ్మి కిరణాల ద్వారా విటమిన్ డి పొందాల్సి ఉంటుంది.
2. మానసిక స్థితి :
మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి సూర్యకాంతి కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులో ఉండే సెరోటోనిన్ అనే మూలకం సూర్యకాంతి ద్వారా వేగంగా విడుదల అవుతుంది. దీంతో ఒక రకమైన సంతోషకరమైన హార్మోన్ విడుదలవుతుంది. అంతేకాకుండా డిప్రెషన్ లేదా ఒత్తిడి సమస్యలు దూరమవుతాయి.
3. ఎముకలు దృఢంగా మారతాయి:
సూర్యరశ్మి వల్ల శరీరానికి వేగంగా విటమిన్ డి అందుతుంది. కాబట్టి బోన్ క్యాన్సర్స్ వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఎముకలు కూడా సులభంగా దృఢంగా మారతాయి. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సూర్యరశ్మి వల్ల వచ్చే విటమిన్ డి వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Health Tips: సూర్యరశ్మి వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఈ దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్!