Banks Alert 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచడంతో ఈఎంఐలు భారంగా మారినా.. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెరగడంతో డిపాజిటర్లకు లాభం కలుగుతోంది. ఇప్పటికే వివిధ బ్యాంకులు ఎఫ్డీలపై కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాయి.
మరోవైపు ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా లిమిటెడ్ పీరియడ్ డిపాజిట్ పథకాల కాల పరిమితి మార్చ్ 31తో ముగుస్తున్నాయని సూచించాయి. ఏయే బ్యాంకుల ఏ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు మార్చ్ 31తో ముగియనున్నాయో తెలుసుకుందాం..
ఎస్బీఐ అమృత్ కైలాష్ డిపాజిట్ ఎఫ్డి పథకం
దేశంలోని అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ దేశీయ, ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం తాజాగా ఎఫ్డీ పథకాల్ని ప్రకటించింది. 400 రోజుల కాల పరమితి కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఎస్బీఐ అమృత్ కైలాష్ డిపాజిట్ ఎఫ్డి పథకాలపై 7.10 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని అందిస్తోంది. మార్చ్ 31లోగా ఈ ఎఫ్డి ముగియనుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డి
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డి అనేది 2020లో లాంచ్ అయింది. మార్చ్ 31 వరకూ ఉంటుంది. ఆకర్షణీయమైన వడ్డీ సౌలభ్యం అందుకునేందుకు ఇదే అవకాశం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డిపై 0.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ ఆఫర్ 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది. 5-10 ఏళ్ల కాల పరిమితిలో 5 కోట్లలోపు ఎఫ్డీ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇండియన్ బ్యాంక్ ఇండ్ శక్తి 555 డేస్ ఎఫ్డి పథకం
ఇండియన్ బ్యాంక్ ఇండ్ శక్తి 555 డేస్ పేరుతో ప్రత్యేక రిటైల్ టెర్మ్ డిపాజిట్ 2022 డిసెంబర్ 19న ప్రకటించింది. 5000 నుంచి 2 కోట్ల వరకూ ఎఫ్డి 555 రోజులకు చేస్తే భారీ వడ్డీ అందిస్తుంది. ఈ స్కీమ్ మార్చ్ 31, 2023తో ముగుస్తోంది. ఈ పధకంలో సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ అయితే..సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ అందుతుంది.
ఐడీబీఐ బ్యాంక్ నామన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్
ఐడీబీఐ బ్యాంకు ..ఐడీబీఐ బ్యాంక్ నామన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ పేరుతో సీనియర్ల సిటిజన్లకు అదనపు వడ్డీ అందిస్తోంది. ఈ పధకం కూడా 2023 మార్చ్ 31తో ముగియనుంది. సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. ఇందులో కనీస డిపాజిట్ 10 వేల రూపాయలు.
పంజాబ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డి పథకం
పంజాబ్ సింధ్ బ్యాంకు సీనియర్ ప్రత్యేక ఎఫ్డి స్కీమ్ అందిస్తోంది. ఈ పథకం మార్చ్ 31తో ముగుస్తోంది. ఇందులో పీఎస్బీ ఫ్యాబ్యులస్ 300 డేస్, పీఎస్‌బి ఫ్యాబ్యులస్ ప్లస్ 601 డేస్, పీఎస్‌బి ఇ అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ మరియు పీఎస్‌బి ఉత్కర్ష్ 222 డేస్ ఉన్నాయి.
Also read: TRAI Order: ట్రాయ్ కొత్త ఆదేశాలు, మరో 5 రోజుల్లో పదంకెల మొబైల్ నెంబర్ పనిచేయదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook