Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో పరిణామం, తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటీషన్

Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2023, 04:53 PM IST
Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో పరిణామం, తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటీషన్

Viveka Murder Case: కడప ఎంపీ అవినాష్ రెడ్డి రేపు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈసారి విచారణ న్యాయవాది సమక్షంలో చేయడమే కాకుండా..ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

వివేకా హత్య కేసులో ఇప్పటి వరకూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించింది. మూడవసారి మార్చ్ 6వ తేదీన విచారణకు హాజరుకావల్సిందిగా కోరుతూ సీబీఐ నోటీసులు పంపింది. అయితే పులివెందులలో ముందస్తు కార్యక్రమాల నేపధ్యంలో తాను ఆ రోజు హాజరుకాలేనని..మార్చ్ 10, 11 తేదీల్లో ఎప్పుడైనా హాజరౌతానని స్పష్టం చేశారు. దీనికి చివరి నిమిషంలో సీబీఐ ఆమోదం తెలిపింది. మార్చ్ 10వ తేదీన విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. 

సీబీఐ జారీ చేసిన తాజా నోటీసుల ప్రకారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి రేపు సీబీఐ ముందు హాజరుకావల్సి ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఇవాళ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటీషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రేపటి తన సీబీఐ విచారణను న్యాయవాది సమక్షంలో చేయడమే కాకుండా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటీషన్ దాఖు చేశారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకూ సీబీఐ అరెస్టు చేయకపోవడమే కాకుండా..అతడి ముందస్తు బెయిల్ పిటీషన్ తిరస్కరించకపోవడాన్ని పిటీషన్‌లో ప్రస్తావించారు. కేసు విచారణ అంతా కేవలం దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే కొనసాగుతోందని అవినాష్ రెడ్డి తెలిపారు. 

వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా లేదని..తనకు వ్యతిరేకంగా ఏ విధమైన సాక్ష్యాలు లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. విచారణలో తాను చెప్పిన విషయాల్ని విచారణాధికారి మార్చేస్తున్నారని అవినాష్ రెడ్డి పిటీషన్‌లో తెలిపారు. తనపై సీబీఐ ఏ విధమైన బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అవినాష్ రెడ్డి కోరారు. 

Also read: APEAPCET 2023: ఏపీఈఏపీసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల, చివరి తేదీ, పరీక్ష ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News