Surya Grahan 2023: సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఈ మూడు రాశుల వారు ఇక పట్టిందల్లా బంగారమే!

Surya Grahan 2023 April Effect: 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 10న జరుగబోతున్న క్రమంలో కొన్ని రాశులకు అశుభం అయితే, కొన్ని రాశులకు అదృష్టాన్ని చేకూరుస్తుందని అంటున్నారు. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 8, 2023, 11:00 AM IST
Surya Grahan 2023: సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఈ మూడు రాశుల వారు ఇక పట్టిందల్లా బంగారమే!

Solar Eclispe Effect on Zodiac Signs: ఈ 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 10న జరుగబోతుంది. మేష రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది, ఇక ఈ మేష రాశికి అధిపతి కుజ గ్రహం. ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 07.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణ సూతక  కాలం మొత్తం 05 గంటల 24 నిమిషాల పాటు ఉండనుంది. అయితే ఈ గ్రహణ సూతక కాలం భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో చెల్లదని అంటున్నారు పండితులు.

అయినా ఈ సూర్యగ్రహణం ఏర్పడుతున్న క్రమంలో కొన్ని రాశులకు అశుభం అయితే, కొన్ని రాశులకు సూర్యగ్రహణం అదృష్టాన్ని చేకూరుస్తుందని అంటున్నారు. ఇక ఏప్రిల్ 10న సంభవించబోతున్న సూర్యగ్రహణం వల్ల ఒక మూడు రాశుల వారికి చాలా మేలు జరుగనుంది. ఆ వివరాలు మీ కోసం 

1. వృషభం 

సూర్యగ్రహణం ప్రభావం వల్ల వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఒక వేళ ఈ రాశి వారు ఉద్యోగం మారాలని ఆలోచిస్తే, అందులో విజయం సాధిస్తారు.ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి  వారికి శుభవార్తలు అందుతాయి. ఈ రాశి వారి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పొదుపు చేయడంలో ఈ రాశి వారు విజయం సాధిస్తారు, అలాగే వీరి సౌకర్యాలు పెరుగుతాయి.

2. మిధున రాశి

సూర్యగ్రహణ ప్రభావం వల్ల మిథున రాశి వారికి ధన లాభాలు కలుగుతున్నాయి. ఈ  మిథున రాశి వారు యాత్రకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎవరి దగ్గరనో ఆగిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు. ఇక  మిథున రాశికి చెందిన వివాహితులకు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక కోర్టులో విజయం ఉంటుంది, అలాగే రాజకీయ ప్రయోజనం ఉంటుంది. కమర్షియల్‌గా  మిథున రాశి వారికి విజయం లభిస్తుంది, అదే విధంగా ఈ రాశి వారి గౌరవం పెరుగుతుంది.

3. ధనుస్సు రాశి

సూర్యగ్రహణ ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారికి పూర్తి సహకారం అయితే అందరి నుంచి లభిస్తుంది. ధనుస్సు రాశికి చెందిన వ్యాపారులు లాభపడతారు. కష్టపడి పని చేసే ధనుస్సు రాశి వారు ఆదాయాభివృద్ధితో పురోభివృద్ధి పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ధనుస్సు రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు.ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారికి సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.

NOTE:

ఈ కథనంలో మేము అందించిన సమాచారం పూర్తిగా నిజం, అని లేదా ఖచ్చితమైనదని మేము ధృవీకరించడం లేదు. పలువురి సలహలు సూచనల మేరకు ఈ ఆర్టికల్ ప్రచురించాం. వాటిని స్వీకరించే ముందు జ్యోతిష్య నిపుణుడి సలహా తీసుకోండి. 
Also Read: Guru Mahadasha: గురు మహాదశతో 16 ఏళ్ల వరకూ తిరుగుండదా, ఏం చేయాలి

Also Read: Mars Transit 2023: సరిగ్గా 4 రోజుల తరువాత ఈ 4 రాశులకు భయంకర కష్టాలు తప్పవా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News