/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

10 సంవత్సరాలు ఖైదు జీవితం అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు రావల్పిండిలోని జైలులో ప్రాణముప్పు పొంచి ఉంది. మూడుసార్లు పాకిస్థాన్‌ ప్రధానిగా పనిచేసిన షరీఫ్‌కు ఈ జైలులో సురక్షిత బ్యారక్ కేటాయించగా.. ఈయనకు సమీపంలో చాలా మంది అతివాద, తీవ్రవాద ఖైదీల బ్యారక్‌లు ఉన్నాయి. వారు తరచూ ఈయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని సిబ్బంది అనుక్షణం కనిపెడుతున్నారు. ఈ ముప్పు నేపథ్యంలో నవాజ్‌కు ఇస్లామాబాద్ జైలుకు మార్చే అవకాశం ఉందని తెలిసింది. 

జైలులో షరీఫ్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు జైల్లో తగిన సదుపాయాలు కల్పించడంలేదని షరీఫ్‌ సోదరుడి ఆరోపణలను పంజాబ్ ప్రావిన్స్ అధికారులు. ఆయనకు జైల్లో ప్రత్యేక సెల్‌తో బెడ్‌, టేబుల్‌, కుర్చీ, వార్తా పత్రికలు, మంచంపై వేసుకోవడానికి దుప్పట్లు, వ్యక్తిగత దుస్తులు, సీలింగ్‌ ఫ్యాన్‌, గోడలకు అమర్చే రెండు చిన్న ఫ్యాన్లు, టాయిలెట్‌ సదుపాయాలు కల్పించామని అధికారులు తెలిపారు. అలాగే 21 అంగుళాల టీవీకి కూడా అనుమతి ఇచ్చామని తెలిపారు. 

జులై 13న స్వదేశంలో అడుగుపెట్టిన నవాజ్‌ షరీఫ్, ఆయన కూతురు మరియమ్‌ అరెస్టయ్యారు. లండన్‌లో అక్రమాస్తులు సంపాదించారని పనామా పత్రాలు వెల్లడించిన కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. లాహోర్‌ విమానాశ్రయంలో దిగిదిగ్గానే పాక్ భద్రతా అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుండి నవాజ్‌ షరీఫ్ ను ప్రత్యేక ఎస్కార్టుతో రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించారు.
 

Section: 
English Title: 
Inmates jeer as Nawaz Sharif takes stroll in prison premises
News Source: 
Home Title: 

జైలులో నవాజ్ షరీఫ్‌కు ప్రాణహాని..!

జైలులో నవాజ్ షరీఫ్‌కు ప్రాణహాని..!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జైలులో నవాజ్ షరీఫ్‌కు ప్రాణహాని..!