Best Face Pack For Glowing Skin: చింతపండు అనేది పుల్లని, తీపి రుచిని కలిగి ఉండే ఆహార పదార్థం. అందుకే దీని పేరు వినగానే అందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలతో పాటు భాస్వరం, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం వంటి అనేక లక్షణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ఫేస్ ప్యాక్‌ను వినియోగించడం వల్ల సులభంగా అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. చింత పండులో హైలురోనిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి చింతపండు ఫేస్ ప్యాక్ తయారుచేసే విధానాన్ని తెలుసుకుందాం..
చింతపండు ఫేస్ ప్యాక్ తయారీకి అవసరమైన పదార్థాలు:
>>చింతపండు గుజ్జు
>>పసుపు పాలు
>>పసుపు
చింతపండు ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేయాలి? :
చింతపండు ఫేస్ ప్యాక్ చేయడానికి, ముందుగా చింతపండు తీసుకుని ఎండలో బాగా ఆరబెట్టాలి.
తరువాత దాని నుంచి గింజలను వేరు చేసి, ఒక గిన్నెలో గుజ్జును తీయండి.
ఈ గుజ్జులో కొద్దిగా పాలు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.
తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తగా మిశ్రమంలా చేసుకోవాలి.
ఇప్పుడు మీ చింతపండు ఫేస్ ప్యాక్ తయారవుతుంది.
చింతపండు ఫేస్ ప్యాక్ ఎలా వినియోగించాలి? :
చింతపండు ఫేస్ ప్యాక్ అప్లై చేయడానికి ముందుగా ముఖం కడుక్కొని తుడవాలి.
తర్వాత సిద్ధం చేసుకున్న చింతపండు ఫేస్ ప్యాక్‌ని మీ ముఖానికి బాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత దానిని సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టండి.
పాలతో మీ ముఖాన్ని 1 నిమిషం పాటు మసాజ్ చేయండి.
ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook