Exercise To Reduce Belly Fat At Home: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీని కారణంగా నిద్రలేమి సమస్యలు, బెల్లీ ఫ్యాట్, శరీర బరువు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఎక్సర్సైజ్‌లో ఎలాంటి ఫోజ్‌లు వేయడం వల్ల బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది:
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి వ్యాయామాలు:
బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడానికి వ్యాయామం చేయడమేకాకుండా.. క్రంచెస్, ఫ్లట్టర్ కిక్స్ వంటి కొత్త కొత్త ఫోజుల్లో చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన మెండి కొవ్వులు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
ఫ్లట్టర్ కిక్స్:
దీన్ని చేయడానికి ముందుగా చాపపై నేరుగా వెనుకవైపు పడుకోండి. అప్పుడు మీ పాదాలను ఒకదానితో ఒకటి ఉంచి, వాటిని ముందు పైకి కదిలించండి. ఇప్పుడు మీ కడుపుని బిగించి.. మీ పాదాలను నేల నుంచి ఎత్తండి, ఆ తర్వాత కాళ్ళను పైకి క్రిందికి తరలించడం ప్రారంభించండి. ఇలా ప్రతి రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
క్రంచెస్:
క్రంచెస్ ఫోజ్ చేయడానికి ముందుగా మీరు నేలపై మీ వెనుకభాగంలో పడుకుని, మీ మోకాళ్లను వంచి, మీ చేతులను మీ తల వెనుకకు ఉంచాలి. ఇప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు, మెడను నిటారుగా ఉంచుతూ, పై పొత్తికడుపు నుంచి క్రంచ్ చేస్తూ పైకి లేపండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీర బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఫోజ్‌ను ప్రతి రోజూ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook