Ponguleti Srinivas reddy Open Challenge to BRS: ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో తన అభిమానులతో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ విధివిధానాలను పొంగులేటి ప్రశ్నించారు.
'నా రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో రోజుకో కథనం వస్తుంది. ఒకసారి బీజేపీలో చేరుతున్నారని అంటున్నారు. మరోసారి షర్మిల పార్టీ చేరేందుకు ముహుర్తం ఖరారు అయిందని అంటున్నారు. అయితే నా నిర్ణయం మాత్రం నన్ను నమ్ముకున్న ప్రజల అభీష్టం మేరకే ఉంటుంది. వారి ఇష్టం ప్రకారమే పార్టీ మార్పు నిర్ణయం ఉంటుంది. ఆ విషయంలో తొందరపాటు లేదు. బెదిరింపులకు గురి చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. అధికారం ఎవరి సొత్తు కాదు.. ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తే అసలు వడ్డీ కలిపి ఇస్తా..' అని ఆయన హెచ్చరించారు.
తన వర్గానికి చెందిన 20 మంది నేతల నుంచి బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంపై పొంగులేటి ఫైర్ అయ్యారు. తన అనుచరులను కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. కొంతమంది తనకు పార్టీలో సభ్యత్వం లేదని అంటున్నారని.. మీ కార్యక్రమాలకు పిలిచినప్పుడు సభ్యత్వం గుర్తుకురాలేదా..? అని ప్రశ్నించారు. గత డిసెంబర్ నెల వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫొటో ఎందుకు వేశారని అడిగారు.
తాను ఏ పార్టీలోకి వెళ్లినా తన అభ్యర్థులే పోటీలో ఉంటారని ఆయన అన్నారు. అశ్వా రావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆది నారాయణ పోటీ చేస్తారని ప్రకటించారు. కొందరు తమ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. భవిష్యత్‌లో వడ్డీ కాదు చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని ఘాటుగా మాట్లాడారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతకొంత బీఆర్ఎస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో తన అనుచరులతో కలిసి వరుసగా సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పడం ఇప్పటికే ఖాయం అవ్వగా.. ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంకా క్లారిటీ రావడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మంచి పట్టు ఉండడంతో అన్ని పార్టీల నేతలు ఆయనను తమ పార్టీలోకి చేరాలని ఆహ్వానిస్తున్నారు. చూడాలని మరి ఈ మాజీ ఎంపీ ఏ పార్టీలో చేరుతారో..!
Also Read: Railway Track Stolen: వింత దొంగతనం.. 2 కిలోమీటర్ల రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన దొంగలు
Also Read: ప్రధాని మోదీ అండతోనే అదానీకి అపార సంపద.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి: ఎమ్మెల్సీ కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి