/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Telangana Governor Tamilisai Soundararajan Hoisted National Flag in Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని రాజభవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. గురువారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. ఆపై సైనికుల గౌరవ వందనం గవర్నర్‌ స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ' తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో డా, బీఆర్ అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది' అని గవర్నర్‌ అన్నారు.

'శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. వైద్యం, ఐటీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ అనుసంధానమై ఉంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్‌ రైలును కేటాయించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ ఎప్పటికప్పుడు అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భనన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తున్నాం' అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. 

Also Read: Surya Guru Yuti 2023: 12 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో సూర్యుడు, గురు.. ఈ 3 రాశుల వారికి పండగే పో!  

Also Read: Malikappuram Movie Review: మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Section: 
English Title: 
Republic Day 2023 Celebrations in Raj Bhavan, Governor Tamilisai Soundararajan Hoisted National Flag
News Source: 
Home Title: 

Republic Day 2023: రాజభవన్‌లో గణతంత్ర వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై! హాజరు కాని ప్రభుత్వ పెద్దలు 
 

Republic Day 2023: రాజభవన్‌లో గణతంత్ర వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై! హాజరు కాని ప్రభుత్వ పెద్దలు
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రాజభవన్‌లో గణతంత్ర వేడుకలు

పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై

హాజరు కాని ప్రభుత్వ పెద్దలు 
 

Mobile Title: 
రాజభవన్‌లో గణతంత్ర వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై! హాజరు కాని ప్రభుత్వ పెద్దలు
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Thursday, January 26, 2023 - 08:14
Request Count: 
44
Is Breaking News: 
No