Rahul Gandhi: ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి.. రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Congress leader Rahul Gandhi shares how his life partner should be. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ తనకు కాబోయే జీవిత భాగస్వామిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 29, 2022, 06:33 AM IST
  • ఆ సుగుణాలు ఉన్న మహిళ అయితే ఓకే
  • జీవిత భాగస్వామిపై రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • వెస్ట్ బెంగాల్‌లో భారత్‌ జోడో యాత్ర
Rahul Gandhi: ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి.. రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Congress leader Rahul Gandhi shares how his life partner should be: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ 'భారత్‌ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3,570 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక రూపొందించారు. సెప్టెంబరు 7న ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర.. విజయవంతంగా కొనసాగుతోంది. భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్ర.. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్‌లోకి ఎంటర్ అయింది. అయితే తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

కాబోయే భాగస్వామి ఎలా ఉండాలనే ప్రశ్నకు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీలోని సుగుణాలతో కూడిన మహిళ అయితే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పారు. 'ఇది ఓ ఆసక్తికర ప్రశ్న. నానమ్మ ఇందిరా గాంధీ వంటి సుగుణాలున్న మహిళ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మ, నానమ్మలో ఉన్న మిశ్రమ లక్షణాలు కలిగినవారైతే ఇంకా మంచిది' అని 52 ఏళ్ల రాహుల్ గాంధీ చెప్పారు. 

మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోటారు సైకిళ్లను నడపడం పట్ల తనకున్న ప్రేమ గురించి చెప్పారు. 'నాకు నిజంగా కార్లపై ఆసక్తి లేదు. మోటారు బైక్‌లపై ఆసక్తి లేదు. నాకు సొంతకారు కూడా లేదు. ఇంట్లో అమ్మది సీఆర్‌-వీ ఉంది. కార్లంటే అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ.. వాటిని రిపేర్ చేయగలను. సమస్యలు 90శాతం తెలుసు. వేగంగా వెళ్లడం ఇష్టం. గాలిలో, నీటిలో, నేలమీద వేగంగా దూసుకెళ్లే ఆలోచనను ఇష్టపడతా' అని పేర్కొన్నారు. 

'స్వశక్తితో నడిపించే సైక్లింగ్‌ అంటే ఇష్టం. ఎన్‌ఫీల్డ్‌ నచ్చదు. ఆ బైక్‌ బ్రేకులు లేదా బ్యాలెన్స్‌ అంటే ఎంతోమందికి ఇష్టం. కానీ నాకు ఓల్డ్‌ లాంబ్రెట్టా చాలా నచ్చుతుంది. నేను ఎలక్ట్రిక్ స్కూటర్‌ని నడిపాను. కానీ ఎప్పుడూ ఎలక్ట్రిక్ బైక్‌ను నడపలేదు. ఈ చైనీస్ కంపెనీని చూశారా... ఎలక్ట్రిక్ మోటార్లతో సైకిల్స్ మరియు పర్వత బైక్‌లను కూడా రూపిందించింది. చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్' అని మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. 

Also Read: Ginger Health Benefits: శీతాకాలంలో అల్లమే మీ బెస్ట్ ఫ్రెండ్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి!

Also Read: Drinking Water Tips: నీరుని ఈ సమయంలో అస్సలు తాగకూడదు.. తాగారో జీర్ణ సమస్య, ఊబకాయం వస్తుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News