DA Hike 2024: ఈ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒకేసారి డబుల్ బోనస్..!

7th Pay Commission DA Hike News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఉద్యోగులకు డీఏ, బోనస్ గిఫ్ట్‌గా ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూపీ సర్కారు కూడా డీఏ 4 శాతం పెంచేందుకు సిద్ధమైంది. 
 

1 /9

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది రెండో డీఏ 3 శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. కేంద్రం ప్రకటన తరువాత జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.  

2 /9

ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకేసారి డబుల్ జాక్‌పాట్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

3 /9

ఈ ఏడాది మార్చి నెలలో స్టాలిన్ సర్కారు 4 శాతం డీఏను పెంచిన విషయం తెలిసిందే. పెంచిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది.  

4 /9

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ ప్రకటన కూడా దీపావళి సందర్భంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి డీఏ పెంపుతోపాటు దీపావళి బోనస్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

5 /9

ఇందుకు సంబంధించిన ఫైల్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఎం స్టాలిన్ గ్రీన్‌సిగ్నల్ తరువాత అధికారిక ప్రకటన రానుంది.    

6 /9

మరోవైపు యూపీలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 15 లక్షల మంది ఉద్యోగులు, 8 లక్షల మంది పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పనుంది.  

7 /9

దీపావళి గిఫ్ట్‌గా 4 శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్‌ల కూడా ప్రకటించవచ్చని చెబుతున్నారు.  

8 /9

ఇందుకు సంబంధించిన ప్రకటన సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

9 /9

డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై రూ.3 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు గతంలో రూ.7 వేలు బోనస్ ఇవ్వగా.. ఈ ఏడాది బోనస్ స్వల్పంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.