Pawan Kalyan Santhana Dharma :జనసేన అధినేత పవన్ కళ్యాన్ రాజకీయంగా ఏది చేసినా సంచలనమే. పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ ప్రతి నిర్ణయం కూడా పొలిటికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా పవన్ స్పందిస్తున్న తీరు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అన్న వార్త తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డును కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సమాజం డిమాండ్ చేసింది.
ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు కూడా లడ్డు వ్యవహారంలో చాలా సీరియస్ గా స్పందించారు. లడ్డు పవిత్రను దెబ్బతీసినందుకు గాను ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ దీక్ష సమయంలో పవన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పొలిటిలకల్ గా వైబ్రేషన్ సృష్టిస్తున్నాయి.
గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నడూ చూడని విధంగా..పవన్ లోకొత్త కోణం ఈ ప్రాయశ్చిత్త దీక్షతో బయటపడింది. సాధారణంగానే పవన్ ప్రసంగం ఆవేశపూరితంగా ఉంటాయి. అందునా ఏదైనా సీరియస్ అంశం ఉంటే పవన్ దానిపై కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతారు. తాజాగా లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. హిందువుల విశ్వాసాన్ని దెబ్బతినేలా తిరుమల లడ్డు అపవిత్రం చేశారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని పవన్ అన్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత పవన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి ఏదైన అపవిత్ర చర్యలు మసీదులు, చర్చుల్లో జరిగితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేవని అలాంటిది కోట్లాది హిందువుల మనోభావాలు తింటే మాత్రం మాట్లాడకూడదా అని ఆవేశంగా మాట్లాడారు. అంతే కాదు సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతటి అపరాధం జరిగినా హిందువులు చేతులు కట్టుకొని కూర్చోవడం సరికాదన్నారు. ప్రతి ఒక్క హిందువు బయటకు రావాలన్న పవన్ మీరు బయటకు రాకుంటే మహా అపరాధం చేసినట్లే అని కూడా పవన్ హిందువులను ఒకింత హెచ్చరించారు.
అయితే పవన్ తీరు ఇప్పుడు టీడీపీలో కొత్త గుబులు సృష్టిస్తుందంట. ఇన్ని రోజులు చూస్తున్న పవన్ కు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కు చాలా తేడా ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. పవన్ కళ్యాణ్ లో అసలైన హిందూత్వవాది బయటకు వచ్చాడని టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా పవన్ మాట్లాడిన తీరు హిందువుల్లో ఒక ఆలోచనను కలిగించాయిన వారు అనుకుంటున్నారు. అయితే ఇది హిందువులకు వరకు బాగానే ఉన్నా హిందేయేతర వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అని టీడీపీ భయపడుతుందంట.ఇన్ని రోజులు టీడీపీ అన్ని మతాలకు, కులాలకు అనుకూలంగా ఉంటుందని రాజకీయంగా చెప్పుకొచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కూడా కూటమికి మతాలకు అతీతంగా ప్రజలు ఓటే వేసి ఘన విజయాన్ని అందించారు.
ఇలాంటి సమయంలో పవన్ హిందూత్వ ఎజెండాతో ముందకు పోవడంపై టీడీపీ కొంత కలవరపడుతుందంట. ఇది రాజకీయంగా ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా అని తెలుగు దేశం పార్టీలో చర్చ జరగుతుందంట. మతాలకు అతీతంగా టీడీపీకీ ఇప్పటి వరకు ప్రజలు మద్దతు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలో , కూటమిలో భాగమైన పవన్ పూర్తిగా హిందూత్వవాదిగా ప్రసంగించడం పట్ల టీడీపీలో ఏమూలనో భయం కనిపిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.పవన్ చేసిన కామెంట్స్ తో మైనార్టీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతారు.. దాని ప్రభావం టీడీపీ ఏమైనా ఉండే అవకాశం ఉందా అంటూ టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయట. ఒక వేళ ఏదైనా రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటే దీనిని నుంచి ఎలా బయటపడాలో కూడా వ్యూహాలు రచిస్తున్నట్లు టీడీపీలో టాక్ నడుస్తుంది. ప్రస్తుత పరిణామాల్లో పవన్ కళ్యాణ్ ను ఏమీ అనలేని పరిస్థితి. టీడీపీకీ ఇప్పుడు పవన్ అత్యంత కావాల్సిన మిత్రుడు. పవన్ ను ఏదైనా అన్న దాని తీవ్రత మరో రకంగా ఉంటుదనే టీడీపీ భావన. అందుకే దీనిని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలనుకుంటుందట.
మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ తిరుమల లడ్డు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. మరోవైపు లడ్డు వ్యవహారం నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ మెడకు చుట్టుకుంటుందా అన్న చర్చ కూడా టీడీపీలో ఉందట. ఐతే తమ అధినేత చంద్రబాబు రాజకీయ దురంధురడని ఎలాంటి సమస్యనైనా చాలా చాకచక్యంగా పరిష్కరిస్తారని అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా టీడీపీలోని మరి కొందరు నేతలు అంటున్నారట.
మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు టీడీపీలో కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ముందు మందు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు..దానికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది మాత్రం త్వరలోనే తేలుతుంది.
ఇదీ చదవండి: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook