Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!

CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త  కానుక ఇవ్వాలని యోచిస్తోందట. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

తెలంగాణ మహిళలకు రేవంత్‌ సర్కార్‌  బతుకమ్మ కానుక ప్రకటించనుంది. అయితే, ఈసారి చీరలకు బదులుగా రూ.500 ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలించింది. ముఖ్యంగా బతుకమ్మ అంటేనే తెలంగాణ రాష్ట్ర పండుగ.   

2 /7

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి మొదటగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత రూ.500 సిలిండర్‌ కూడా ఇచ్చింది. రూ.2500 మహిళల ఖాతాల్లో జమా చేయడం పై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోందట.  

3 /7

అయితే, మరో 10 రోజుల్లో బతుకమ్మ పండుగ కూడా ప్రారంభం కానుంది. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చీరలను కానుకగా ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు రూ.500 నగదు ఇచ్చేలా ప్రభుత్వం పరిశీలిస్తోందట.  

4 /7

రూ.500 లేదా ఆపైనా అందించేలా కసరత్తు చేస్తోందట. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలలో నాణ్యత కొరవడిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట.   

5 /7

ఈ నగదును మహిళల ఖాతాల్లో జమా చేయడానికి రేషన్‌ కార్డును ప్రతిపాదికను తీసుకునేలా పరిశీలిస్తోందట. వారి చేతికి ఇవ్వాలా అని కూడా పరిశీలన చేస్తోందట. స్వయం సంఘాల సభ్యత్వం ఆధారంగా ఈ కానుక ఇచ్చేఆ ప్రయత్నిస్తోందట.  

6 /7

మరో మూడు రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వస్తుంది. అయితే, ఇప్పటికే చేనేత వారికి కూడా చీరలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చేనేతకు ఉపాధి అందిస్తోంది. నిర్మల్‌, సిరిసిల్ల, పోచంపల్లి వారు ఈ చీరలను నేస్తారు.   

7 /7

వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా బతుకమ్మ చీరల ఆర్డర్‌ ఇచ్చేవారు. ఇలా నగదు ఇస్తే వారి ఉపాధికి గండి పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోచూడాలి.