India vs Bangladesh Test Series: బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా ఈ ఏడాదిని టీమిండియా ఘనంగా ముగించింది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా.. సీనియర్ ప్లేయర్ పుజారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ రెండు టెస్టుల్లోనూ ఆకట్టునే ప్రదర్శన చేశాడు. రిషబ్ పంత్ టెస్టుల్లో తన విలువెంటో చాటిచెప్పాడు. అశ్విన్ అటు బ్యాట్‌తో.. ఇటు బాల్‌తో రాణించాడు. కుల్దీప్ యాదవ్ ఆడిన ఒకే టెస్టులో సూపర్ బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. సిరాజ్, ఉమేశ్ యాదవ్‌కు స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. ఇలా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మినహా మిగిలిన ఆటగాళ్లు అందరూ ఆకట్టుకున్నారు.
బ్యాకప్ కీపర్‌గా ఎంపికైన కేఎస్ భరత్ మరోసారి రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఉండడంతో భరత్‌కు అవకాశం దక్కడం లేదు. ఈ యంగ్ ప్లేయర్ దాదాపుగా జట్టుతో ఉన్నా.. అరంగేట్ర మ్యాచ్ కోసం ఇంకా ఎదురుచూడాల్సి వస్తోంది. బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుపై తుది జట్టులో స్థానం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నా.. రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశే ఎదురైంది.
కేఎస్ భరత్ అరంగేట్రం చేయకున్నా.. ఒక మ్యాచ్‌లో జట్టు తరుఫున కీపింగ్ చేశాడు. ఒక మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా గాయపడగా.. అతని స్థానంలో కేవలం కీపింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో భరత్ వికెట్ల వెనుక మంచి ప్రదర్శన చేశాడు.
దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు
కేఎస్ భరత్ దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఆడుతున్నాడు. 2013లో అరంగేట్రం మ్యాచ్ ఆడాడు. అతను 83 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4502 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా లిస్ట్ ఎ క్రికెట్‌లో 64 మ్యాచ్ ఆడి 1950 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 6 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కేఎస్ భరత్‌ను రూ.1.20 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌తో జట్టు కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ.20 లక్షలు.
Also Read: చికెన్ బిర్యానీ తిని వెంటనే చనిపోయారు.. అసలు విషయం బయటపెట్టిన రవిబాబు
Also Read: Samantha Ruth Prabhu : వారందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే.. సమంత పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Ind Vs Ban: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఏడాదిగా జట్టుతోనే తిరుగుతున్న యంగ్ క్రికెటర్