Laxmi Narayan Rajyog: లక్ష్మీ నారాయణ రాజయోగం ఈ 3 రాశులకు ప్రత్యేకం.. వీరికి డబ్బే డబ్బు..

Laxmi Narayan Rajyog: మరో 5 రోజుల్లో మకరరాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగ ప్రభావం వల్ల 3 రాశుల వారు అపారమైన ధనాన్ని పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2022, 05:08 PM IST
Laxmi Narayan Rajyog: లక్ష్మీ నారాయణ రాజయోగం ఈ 3 రాశులకు ప్రత్యేకం.. వీరికి డబ్బే డబ్బు..

Laxmi Narayana Rajyogam: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా సంచరించడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల డిసెంబర్ 29న లక్ష్మీ నారాయణ రాజయోగం (Laxmi Narayan Rajyog) ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం మూడు రాశులవారికి అనేక ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేష రాశిచక్రం (Aries): లక్ష్మీ నారాయణ రాజయోగం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో పదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. మీరు పని మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. నిరుద్యోగులు కొత్త జాబ్ ను పొందే అవకాశం ఉంది. 

వృషభ రాశి (Taurus): లక్ష్మీ నారాయణ రాజయోగం మీకు ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. బిజినెస్ విస్తరించడానికి ఇదే మంచి సమయం. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 

ధనుస్సు రాశిచక్రం(Sagittarius): లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు మీకు లాభిస్తాయి. ఎందుకంటే మీ రాశి నుండి పదకొండవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీకు ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 

Also Read: Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత శని గమనంలో పెను మార్పు... ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News