BRS vs Ysrcp: బీఆర్ఎస్ పార్టీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుందా, సజ్జల వ్యాఖ్యల అర్ధమేంటి

BRS vs Ysrcp: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌పై వివిధ పార్టీల నేతలు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2022, 04:23 PM IST
BRS vs Ysrcp: బీఆర్ఎస్ పార్టీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుందా, సజ్జల వ్యాఖ్యల అర్ధమేంటి

మొన్న సమైక్యాంధ్ర ప్రదేశ్‌పై వ్యాఖ్యలతో సంచలనం రేపిన ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ విషయమై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారింది. ఆంధ్రప్రదేశ్  విజయవాడలో సైతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. విజయవాడలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీను స్వాగతిస్తూ కటౌట్ ఏర్పాటైంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలనేదే తమ అభిమతమని చెప్పి సంచలనం రేపిన సజ్జల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి ఆసక్తిరేపే వ్యాఖ్యలు చేశారు. 

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే మంచిదేనని సజ్జల రామకృష్ణారెడ్జి తెలిపారు. దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏపీలో తమ పార్టీ మద్దతు కోరితే..అందరితో చర్చించి ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. బీఆర్ఎస్ పార్టీపై తమ అభిప్రాయం తమకుందన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలో వచ్చే ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు లేదన్నారు. 

త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్నారు. ఏ రాష్ట్రంలో పోటీ చేసే ఆలోచన లేదన్నారు. అందుకే కనీసం తెలంగాణలో కూడా పోటీ చేయకుండా..పూర్తిగా ఏపీపైనే దృష్టి సారించామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఒకవేళ తాము పోటీ చేయాలనుకుంటే..తమిళనాడులో సైతం పోటీ చేయవచ్చన్నారు. 

Also read: Pawan Kalyan: గుండె భారంగా మారుతోంది.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. జనసైనికులకు పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News