Osey Ramulamma Song Vs Jai Balayya Song : అసలే ఇప్పుడు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. బాస్ పార్టీకి కాస్త నెగిటివ్ టాక్ రావడంతో అందరూ కూడా బాలయ్య వీరసింహారెడ్డి పాట మీద ఫోకస్ పెట్టేశారు. ఇదెలా ఉంటుందో అని ఎదురుచూడసాగారు. తమన్ మీద భారీ అంచనాలతో నందమూరి అభిమానులు రెడీగా ఉన్నారు. సౌండ్ బాక్సులు పగిలిపోయాయ్ అని తమన్ కూడా ఓ ట్వీట్ వేశాడు. కానీ తమన్ చెప్పినట్టుగా మరీ అంత మాస్ బీటేమీ కాదు అది.
అలా అని తమన్ కొట్టింది కొత్త బీట్ అసలే కాదు. ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్‌ను జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ మార్చేశాడు. ఇలా కాపీ ట్యూన్‌ను జనాలు పట్టేసి ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నాడు. ఇలా ట్యూన్లు కాపీ కొట్టడం తమన్‌కు కొత్తేమీ కాదు. ఇది వరకు అయితే తన సినిమాలవి తానే కొట్టేసేవాడు. బ్లాక్ బస్టర్ పాటను మళ్లీ తిప్పి తిప్పి వాడేశాడు. ఇలా తమన్ పాటలు వస్తున్నాయంటే ట్రోలర్స్, మీమర్స్ రెడీగా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook