Budh Shukra Gochar 2022: ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా.. అది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. గ్రహ సంచారాల పరంగా నవంబర్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెల 11వ తేదీన అత్యంత శుభప్రదమైన నవపంచం యోగం ఏర్పడింది. ఈ రాజయోగాన్ని (Navpancham Rajyog) గురుడు, శుక్రుడు, బుధుడు కలిసి ఏర్పరుస్తున్నాయి. ఇది 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. ఈ రాజయోగం డిసెంబరు 3 వరకు ఉంటుంది. ఈ యోగం 5 రాశులవారికి చాలా డబ్బును ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): నవపంచం రాజయోగం వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో చాలా లాభాలను ఇస్తుంది. నిరుద్యోగులు కొత్త జాబ్ ను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు భారీగా లాభాలను ఆర్జిస్తారు. రాజకీయ నాయకులకు పదవులు దక్కుతాయి.
మిథునం (Gemini): మిధున రాశి వారికి నవపంచం రాజయోగం లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. మీరు వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer): ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణం అనుకూలిస్తాయి. పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందుతారు. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
తుల (Libra): ఈ రాజయోగం తులారాశి వారికి లాభిస్తుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది.
కుంభం (Aquarius): ఇది ఉద్యోగ, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Astro and Zodiac Sign Tips: పెళ్లికి ముందు జాతకంలో ఏం చూస్తారు. ఏ రాశికి ఏ రాశితో కుదురుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook