High cholesterol Symptoms: ఈ లక్షణాలు ఉంటే మీలో కూడా చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నట్లే.. తస్మాత్‌ జాగ్రత్త..

High cholesterol Symptoms: బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చు. అయితే చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే శరీరంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా దీంతోపాటు పాదాల్లో తీవ్ర సమస్యలు వస్తాయి. అయితే చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల ఈ సమస్యలు కూడా వస్తాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 01:47 PM IST
  • బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల
  • తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చు.
  • పాదాల్లో తీవ్ర సమస్యలు వస్తాయి.
High cholesterol Symptoms: ఈ లక్షణాలు ఉంటే మీలో కూడా చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నట్లే.. తస్మాత్‌ జాగ్రత్త..

High cholesterol Symptoms: శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది గుండెపోటు, స్ట్రోక్,  పక్షవాతం వంటి తీవ్ర ప్రాణాంతక వ్యాధులకు దారీ తీసే అవకాశాలున్నాయి.  అధిక కొలెస్ట్రాల్ కూడా పరిమితికి మించి పెరిగినప్పుడే శరీరంలో పలు రకాల మార్పులు సంభవించవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల  పలు రకాల సంకేతాలు కనిపించవచ్చు. అయితే చాలా మంది వీటి లక్షణాలు తెలియక వారు పలు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కేవలం కొన్ని రోజుల్లోనే ప్రాణాంతక వ్యాధులు సంభవించవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఈ సాంకేతలు మీలో ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఈ లక్షణాలు తప్పవు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరగడం వల్ల రక్తంలోని కొవ్వు పరిమాణాలు పెరిగి  సిరల్లో పలు రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని వల్ల పలువురిలో రక్త ప్రసరణ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రక్తంలోని కొవ్వు పెరగడం వల్ల ఆ ప్రభావవం మొదట కాళ్ళపై పడుతుంది. దీంతో కాళ్లలో పలు రకాల మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు.

పాదాల నొప్పి:
రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం ప్రారంభమవుతుంది.  శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాళ్ళలో నొప్పి వంటి లక్షణాలు ఎదురవొచ్చు. అంతేకాకుండా కాళ్ల నారాలపై ప్రభావవం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీరు పలు జాగ్రత్తలు పాటించడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల నడకలో కూడా అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పాటు తొడలు, తుంటి వరకు నొప్పులు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా కాళ్లలో నొప్పులు రావడం వల్ల కూడా మొదటి లక్షణంగా భావించవచ్చు.

తిమ్మిరి అనిపించినట్లయితే:
నొప్పితో పాటు తిమ్మిరి, తుంటి, పాదాలలో జలదరింపు, పాదాలు లేదా వేళ్లలో మంట, చల్లగా అనిపించినట్లయితే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి పాదాల్లో మార్పులు సంభవించి పలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.  

చెడు కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు ఈ లక్షణాలు తప్పవు:
>>పాదాలు పసుపు రంగులోకి మారడం.
>>కాలికి గాయమైతే త్వరగా తగ్గకపోవడం .
>>కండరాల తిమ్మిరి, బలహీనత, అలసిపోవడం.
>>మొటిమలు

Also Read : Karwa chauth 2022 : కర్వాచౌత్ స్పెషల్.. కొత్త జంటల సందడి.. కత్రినా-విక్కీ జోడి పిక్స్ వైరల్

Also Read : "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం: మంచు విష్ణు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News