GST Collections: దేశంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

GST Collections: దేశంలో వస్తు, సేవల పన్ను(GST) వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.  గతంలో ఎన్నడూ లేనివిధంగా వసూళ్లు వస్తున్నాయి. ఆ వివరాలు..

Written by - Alla Swamy | Last Updated : Oct 1, 2022, 03:55 PM IST
  • రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
  • గతంలో ఎన్నడూ లేనివిధంగా రాబడి
  • వెల్లడించిన అధికారులు
GST Collections: దేశంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

GST Collections: దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. సెప్టెంబర్ నెలకు గాను రూ.1,47,683 కోట్లు వసూలు అయ్యింది. ఈవిషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే 26 శాతం వృద్ధిగా ఉంది. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైగా నమోదు కావడం ఇదే ఏడోసారి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.

మరోవైపు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో ..భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఇదే విషయాన్నికేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.25,271 కోట్లుగా ఉంది. ఎస్‌జీఎస్టీ రూపంలో రూ.31, 813 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,464 కోట్లుగా ఉంది. సెస్ రూపంలో మరో రూ.10,137 కోట్లు సమకూరిందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. 

గత నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 39 శాతం పెరిగింది. ఇటు దేశీయ లావాదేవీల ఆదాయంలో 22 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈవిషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వచ్చాయి. తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 12 శాతం నమోదు అయ్యింది. తెలంగాణలో గతేడాది సెప్టెంబర్‌లో రూ.3,494 కోట్లుగా ఉంది.

గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.3,915 కోట్లుగా నమోదు అయ్యింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ఈఏడాడి జీఎస్టీ వసూళ్లలో 21 శాతం వృద్ధి నమోదు అయ్యింది. గతేడాది సెప్టెంబర్‌ నెలలో రూ.2,595 కోట్లుగా జీఎస్టీ వసూళ్లు ఉండగా..ఈఏడాది అదే నెలలో రూ.3,132 కోట్లకు పెరిగింది. ఈవిషయాన్ని జీఎస్టీ కౌన్సిల్, ఆర్థిక శాఖ అధికారికంగా తెలిపాయి. 

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!  

Also read:IND vs SA: మరో టీ20 సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన..రేపే రెండో మ్యాచ్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News