Astro Hints: జ్యోతిష్యం, హిందూమతంలో ఇవాళ సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, తెలుసుకోవల్సిన 10 ముఖ్య విషయాలు

Astro Hints: జ్యోతిష్యశాస్త్రం, మతానికి సంబంధించి 10 కీలకమైన విషయాలు ఇవాళ వార్తల్లో ఉన్నాయి. సూర్యుడి గోచారం, రానున్న 4 నెలల్లో గ్రహాల పరివర్తనం, పితృ పక్షం, నవరాత్రి వంటి విషయాలు తెలుసుకోవల్సిందే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 17, 2022, 06:10 PM IST
Astro Hints: జ్యోతిష్యం, హిందూమతంలో ఇవాళ సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, తెలుసుకోవల్సిన 10 ముఖ్య విషయాలు

Astro Hints: జ్యోతిష్యశాస్త్రం, మతానికి సంబంధించి 10 కీలకమైన విషయాలు ఇవాళ వార్తల్లో ఉన్నాయి. సూర్యుడి గోచారం, రానున్న 4 నెలల్లో గ్రహాల పరివర్తనం, పితృ పక్షం, నవరాత్రి వంటి విషయాలు తెలుసుకోవల్సిందే..

1. కొన్ని రాశులకు రానున్న 7 రోజులు అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి. వారాంతపు రాశిఫలాల ప్రకారం ఈ వారం కొన్ని రాశులకు శుభ సూచకం. అంతులేని లాభాలు కలుగుతాయి.

2. పితృపక్షంలో కొన్ని చెట్లను పూజించాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఫలితంగా ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. పితృపక్షం అనేది సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూర్తి భక్తి శ్రద్ధలతో పిత్రులకు శ్రద్ధాంజలి ఘటించాలి. పితృపక్షంలో పిండదానం, దానం చేయడం వల్ల ఆశీస్సులు లభిస్తాయి. చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల చెట్లను పూజించడం వల్ల శుభం కలుగుతుంది. 

3. నవరాత్రి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని పద్ధతులున్నాయి. లక్ష్మీదేవి ప్రసన్నమైతే..అంతులేని సంపదలు కలుగుతాయి. అందుకే ఈ 9 రాత్రులు చాలా కీలకం. నవరాత్రి సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షంతో ఆర్ధికంగా లాభపడవచ్చు.

4. కొన్ని రాశులవారికి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. కర్కాటక రాశివారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. ప్రస్తుతం వీరికి అనుకూల సమయముంది. కన్యారాశివారికి కూడా సకాలంలో పనులు పూర్తవుతాయి.

5. కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. ముఖ్యంగా టోటల్ నెంబర్ 8 కలిగిన వారికి విశిష్ట వ్యక్తులుగా ఉంటారు. సెప్టెంబర్ 17న పుట్టినవారి టోటల్ నెంబర్ 8 అవుతుంది. 

6. కొంతమంది పేదరికంలో పుట్టినా అంతులేని డబ్బులు సంపాదిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం వారికి ఎప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ముఖ్యంగా ఈ వారం నాలుగు రాశులపై ఉంటుంది. 

7. లంక నుంచి తిరిగొచ్చిన తరువాత బాలి కుమారుడు అగంద్..రాముడికి మొత్తం కథంతా విన్పిస్తాడు. ఆ తరువాత శ్రీరాముడు ప్రముఖులందరినీ పిలిచి..యుద్ధ రణనీతి తయారు చేస్తాడు.

8. నవరాత్రి 9వ రోజున సిద్దిదాత్రి దేవి పూజ నిర్వహిస్తారు. ఆ దేవి పూజ చేయడం వల్ల  8 సిద్ధిత్వాలు ప్రాప్తిస్తాయి. రోగం, భయం, శోకం నుంచి విముక్తి కలుగుతుంది. 

9. భర్త దీర్ఘాయుష్షు కోసం కర్వా చౌత్ వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 13, 2022న ఉంది. ఈ వ్రతం ప్రారంభంపై ఓ ఆసక్తికర కధనం ఉంది. 

10. ఈ ఏడాది అంటే 2022లో రానున్న 4 నెలల్లో గ్రహ పరివర్తనాలు ఎలా ఉంటాయంటే..కొన్ని రాశుల కెరీర్, ఆర్ధిక పరిస్థితులు అద్భుతంగా మెరుగుపడతాయి. సూర్యుడు, మంగళ, బుధ, శుక్ర, శని గ్రహాల స్థితిలో కీలకమార్పు ఉంటుంది. 

Also read: Budh Varki 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం..రాబోయే 15 రోజులు ఎవరికి లాభం, ఎవరికి నష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News