Dates Benefits: ఖర్జూరం గురించి అరేబియా ప్రాంతంలో ఓ చక్కని వ్యాఖ్యానముంది. మరణానికి తప్ప అన్ని సమస్యలకు పరిష్కారమని. నిజంగానే అంతటి అద్భుత గుణాలున్న ఖర్జూరంతో స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చంటున్నారు.
డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరంతో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆధునిక జీవనశైలితో ప్రధాన సమస్యగా మారిన స్థూలకాయానికి ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే బరువు తగ్గేందుకు ఖర్జూరాన్ని ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఖర్జూరంలో పుష్కలంగా లభించే పోషక పదార్ధాలు చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. స్థూలకాయం మీకు సమస్యగా ఉంటే ఖర్జూరం కచ్చితంగా..ఉపయోగపడుతుంది. అయితే దీనికో పద్ధతి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఖర్జూరం తింటే ఫలితముండదు. నిర్ణీత సమయంలో తింటేనే ప్రయోజనం కలుగుతుంది. మరి బరువు తగ్గేందుకు ఖర్జూరం ఏ సమయంలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరంతో అధిక బరువుకు చెక్, ఎలా
ఖర్జూరం అనేది హై ప్రోటీన్ పదార్ధం. హై ప్రోటీన్ అనేటప్పటికి బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ ఖర్జూరం రోజూ తీసుకుంటే..బరువు వేగంగా తగ్గుతారు. అయితే ప్రతిరోజూ ఉదయం పూట ఖర్జూరం తినడం మంచిది. ఉదయం వేళ పరగడుపున ఖర్జూరం తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. కేలరీలు నియంత్రించుకోవచ్చు.
రాత్రి వేళ ఖర్జూరం తింటే జీర్ణక్రియలో సమస్యలు రావచ్చు. అందుకే ఎప్పుడూ ఉదయం పరగడుపున తీసుకోవడమే మంచిది. ఖర్జూరం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబోలిజం మెరుగై..శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలంటే ఖర్జూరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం వేళ పరగడుపునే తీసుకోవాలి. దీనికోసం రాత్రంతా ఖర్జూరం నీళ్లలో నానబెట్టి ఉదయం తినాలి. రోజుకు అలా 3-4 ఖర్జూరం పళ్లు తినవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook