Type 1 Diabetes: డయాబెటిస్ చాలా రకాలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైంది టైప్ 1 డయాబెటిస్. అసలు టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి, ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. దాదాపు ప్రతి ఇంట్లో డయాబెటిక్ రోగులుంటున్నారు. అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా టైప్ 2 డయాబెటిస్ బారినపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ అనేది ఆ వ్యక్తి చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వస్తుంటుంది. కానీ టైప్ 1 డయాబెటిస్ అనేది వేరు. ఇది పిల్లల్లో కూడా ఉండవచ్చు. ఎందుకంటే టైప్ 1 డయాబెటిస్ ముప్పు అనేది ఇంట్లో ముందు నుంచి ఎవరికైనా అంటే..పెద్దవాళ్లలో ఉంటే పిల్లలకు తరువాతి తరాలకు సంక్రమిస్తుంది. అంటే జెనెటిక్ కారణం. బాల్యావస్థ నుంచి పెద్దయ్యేవరకూ ఏ వయస్సులోనైనా రావచ్చు. టైప్ 1 డయాబెటిస్ చికిత్సా విధానాన్ని గురించి పరిశీలిద్దాం..
టైప్ 1 డయాబెటిస్ ఏ వయస్సులోనైనా రావచ్చు. మీ పాంక్రియాస్‌లో బీటా సెల్స్ అంతమైనప్పుడు, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. రక్తంలో చక్కెరను గ్లోకోజ్, మాల్టోజ్‌గా మార్చి శరీరంలోని సెల్స్‌కు తీసుకెళ్లేది ఇన్సులిన్. టైప్ 1 డయాబెటిస్ అనేది జెనెటిక్ కారకం. ఇదొక ఆటో ఇమ్యూన్ ప్రతిక్రియకు పరిణామక్రమంలో భాగంగా వస్తుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే డిసార్డర్. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు
తీవ్రమైన అలసట, ఎక్కువ ఆకలి, గాయం త్వరగా మానకపోవడం, బరువు తగ్గడం, మూత్రంలో ఇబ్బంది, దాహం ఎక్కువగా ఉండటం, దురద లేదా యూటీఐ
టైప్ 1 డయాబెటిస్ చికిత్స
టైప్ 1 డయాబెటిస్‌కు ఇంజెక్షన్‌తో పాటు సరైన చికిత్స అవసరం. ఇది శరీరంలో ఇన్సులిన్ తీవ్రతను పెంచేందుకు దోహదం చేస్తుంది. దీనికి చికిత్స వివిధ రకాల్లో ఉంటుంది. కానీ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది డైట్ పై ఆధారపడి ఉంటుంది. ఉదయం లేచినప్పట్నించి రాత్రి భోజనం వరకూ ఎలాంటి ఆహారం తీసుకుంటాడనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఒక ఎనర్జీలా ఉపయోగపడుతుంది. టైప్ 1 డయాబెటిస్‌లో శరీరపు ఎనర్జీ తగ్గిపోతుంది. అందుకే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు.
Also read: Type-1 Diabetes Treatment: మీలో ఈ లక్షణాలు ఉంటే..టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Type 1 Diabetes: టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, కారణాలేంటి