CM Jagan Comments: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్. ఈ సందర్బంగా జిల్లాకు పలు వరాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ప్రాజెక్టు రెండు టన్నెళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. చీమకుర్తి సభలో సీఎం జగన్ చేసిన ఎన్నికల ప్రకటన ఏపీలో హాట్ హాట్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. పార్టీ కార్యక్రమాలపై సీఎం జగన్ ఫోకస్ చేయడం.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తుండటం.. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ముందస్తు ఎన్నికల కోసమే దూకుడు పెంచారనే టాక్ వచ్చింది. తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే చర్చ సాగింది. అయితే తాజాగా జగన్ చేసిన కామెంట్లతో ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి 2023 సెప్టెంబర్ గడువు పెట్టారు జగన్. దీంతో 2024లో గడువు ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయనే సంకేతం ఇచ్చారు సీఎం జగన్.
చీమకుర్తి సభలో పలు కీలక ప్రకటనలు చేశారు సీఎం జగన్. గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ స్లాబ్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల్లోనూ రాయితీ ఇచ్చి చిన్న పారిశ్రామికవేత్తలను ఆదుకుంటామన్నారు. 2023, ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని సభా వేదికగా ప్రకటించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు కరెంట్ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందన్నారు.జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోరిడంతో ఒంగోలులో శిథిలావస్థలో ఉన్న కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తుళ్లూరు మండలం శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Bandi Sanjay: లిక్కర్ ఆరోపణలు డైవర్ట్ చేసేందుకు మత ఘర్షణలు! కేసీఆరే ప్లాన్ చేశారన్న సంజయ్
Read Also: AP, TS POLICE FIGHT: ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి