Fact Behind Makers to compensate distributors for Laal Singh Chaddha loss: అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఐదు రోజుల్లో దారుణమైన వసూళ్లు రాబట్టింది. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సెలవు కావడంతో 'లాల్ సింగ్ చద్దా' 5వ రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని అనుకున్నారు. కానీ ఆదివారం కంటే కూడా సినిమా వసూళ్లు తగ్గాయి. ఆదివారం ఈ సినిమా రూ.10.25 కోట్లు వసూలు చేయగా సోమవారం కేవలం 8.25 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. మంగళవారం నుంచి సెలవులు రావడంతో సినిమాకు అసలు కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఇప్పుడు అమీర్ ఖాన్ తన పరువు కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు.
'లాల్ సింగ్ చద్దా' హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్. ఈ సినిమాలో అమీర్ ఖాన్‌తో పాటు కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్, నాగ చైతన్య అలాగే మానవ్ విజ్ కూడా నటించారు. అయితే 'లాల్ సింగ్ చద్దా' సినిమాని ప్రేక్షకులు తిరస్కరించిన తీరు షాకింగ్‌గా మారింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కలిసి రాలేదు. లాల్ సింగ్ చద్దా శనివారం రూ.8.75 కోట్ల బిజినెస్ చేయడంతో . ఆదివారం దాదాపు 20% ఆదాయాలు పెరిగాయి, దీంతో ఇప్పుడు సినిమా వసూళ్లు ఊపందుకుంటాయి అనుకున్నా సోమవారం బాక్సాఫీస్ వద్ద ఆదివారంతో పోలిస్తేవసూళ్లు 20% పడిపోయాయి. 'లాల్ సింగ్ చద్దా' 5 రోజుల్లో రూ.46 కోట్లు మాత్రమే రాబట్టింది.
'లాల్ సింగ్ చద్దా' సోమవారం వరకు 5 రోజుల్లో 46 కోట్ల రూపాయలను రాబట్టింది. గత 10 ఏళ్లలో అమీర్ ఖాన్ సినిమాకి ఇదే అత్యంత చెత్త కలెక్షన్స్ అని అంటున్నారు. సినిమాపై విపరీతమైన నెగిటివిటీ వ్యాపించడమే ఇలా డిజాస్టర్ కావడానికి కారణమని అర్థమవుతోంది. అయితే అమీర్ ఖాన్ సినిమాలు మౌత్ టాక్ కారణంగా రికార్డులు సాధించేవి కానీ ఈ సినిమా బోల్తా కొట్టింది. ఒక పక్క బాయ్‌కాట్ చేయమని కొందరు పిలుపునిస్తున్న క్రమంలో 'లాల్ సింగ్ చద్దా' వసూళ్లు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. అయితే అమీర్ ఖాన్ మొదటి రోజునే సినిమా ఫెయిల్యూర్‌ని దాదాపుగా అంగీకరించారు కూడా. నిజానికి 'లాల్ సింగ్ చద్దా' ప్రకటన వెలువడినప్పటి నుంచి సినిమాను బహిష్కరిస్తారారని అమీర్ ఖాన్ భయపడ్డాడు.
బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు సోషల్ మీడియాలో నిరంతరం ట్వీట్లు చేస్తూనే ఉండడంతో ఈ ప్రచారాన్ని చూసి అమీర్ ఖాన్ సహా 'లాల్ సింగ్ చద్దా' నిర్మాతలు భయపడ్డారు. అందుకే ముందు జాగ్రత్తతో మీడియా ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అది కాక అమీర్ ఖాన్ తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దీని తర్వాత కూడా సోషల్ మీడియాలో 'బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా' అనే ట్రెండ్ తగ్గ లేదు.
లాల్ సింగ్ చద్దా వసూళ్లను చూసిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల నుండి నష్టానికి పరిహారం కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వయాకామ్ 18 సీఈఓ అజిత్ అంధారే మాట్లాడుతూ – ఈ సినిమాకు బయటి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ లేరు. దీనిని V18Studios డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అలాగే ఈ సినిమా విషయంలో నష్టం లేదు. ఈ సినిమా ఇప్పటికీ భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా థియేటర్లలో బాగా రన్ అవుతోంది. ఇవి నిరాధారమైన వార్తలని అన్నారు.
Also Read: Bipasha Basu Pregnancy: తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!
Also Read: Dil Raju Fires on Media: క్లిక్స్ కోసం నన్ను బద్నామ్ చేయొద్దు.. కామన్ సెన్స్ ఉండాలంటూ దిల్ రాజు ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి