Ricky Ponting says India beat Pakistan in Asia Cup 2022 clash: ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇండో-పాక్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2021లో పోటీపడ్డ భారత్, పాకిస్థాన్ జట్లు.. యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ 2022లో ఆగష్టు 28న తలపడనున్నాయి. ఇరు జట్లు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారత్, పాకిస్థాన్ మ్యాచుకు ఇంకా 15 రోజుల సమయం ఉన్నా.. అప్పుడే ఈ మెగా సమరంపై చర్చ మొదలైంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ మ్యాచ్ విజేత ఎవరనే విషయంపై జోస్యం చెప్పాడు. ఐసీసీ రివ్యూ ఎసిసోడ్‌లో పాంటింగ్ మాట్లాడుతూ... 'ఎక్కడ టోర్నమెంట్ జరిగినా భారత్ కఠిన ప్రత్యర్థే. ఇతర జట్లతో పోలిస్తే.. టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లో డెప్త్ ఉంది. ఆసియా కప్ 2022లో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్ టోర్నీలో పాక్‌పై భారత్ ఆధిపత్యం చలాయిస్తే.. ఆసియా కప్‌లో మాత్రం ఫలితం బిన్నంగా ఉంది. ఇరు జట్లు 13 సార్లు తలపడితే.. భారత్ 7, పాకిస్తాన్ 5 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు' అని అన్నాడు.
'భారత్, పాకిస్తాన్ మ్యాచులో నా ఫెవరెట్ మాత్రం టీమిండియానే. ఆసియా కప్ 2022 కూడా భారత్ గెలుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే పాక్‌ను అంత తేలికగా తీసేయడానికి లేదు. బాబర్ సేన ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు సూపర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. హోరాహోరీ తప్పదు. ఇంకో 15-20 ఏళ్లయినా భారత్, పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ తగ్గదు. ఒక క్రికెట్ ప్రేమికుడిగా, పరిశీలకుడిగా ఇటువంటి మ్యాచులను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
'క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులగానే చూస్తారు. కానీ అది కేవలం యాషెస్ టెస్టు సిరీస్‌కు మాత్రమే పరిమితం. కానీ భారత్, పాకిస్తాన్ విషయంలో అలా కాదు. ఏ ఫార్మాట్‌లో అయినా ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తిగా ఉంటుంది. భారత్, పాక్ టెస్టు క్రికెట్‌లో తలపడతే చుడాలనుంది. అసలు మజా టెస్టుల్లోనే ఉంటుంది' అని ఆసీస్ మాజీ ఆటగాడు పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
Also Read: IND vs PAK: సాధారణ మ్యాచ్‌లాగే భారత్‌తో తలపడతాం.. ఫలితం మా చేతుల్లో లేదు: బాబర్
Also Read: అనుష్క అరుంధతి సినిమా చూసి యువకుడి ఆత్మార్పణ.. కర్ణాటకలో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook