Gorantla Madhav: న్యూడ్ వీడియో అంతా కుట్ర..న్యాయ పోరాటం చేస్తానన్న ఎంపీ గోరంట్ల మాధవ్..!

Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్‌ కౌంటర్ ఇచ్చారు. 

Written by - Alla Swamy | Last Updated : Aug 4, 2022, 05:34 PM IST
  • గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో
  • న్యూస్ వీడియోపై రాజకీయ దుమారం
  • క్లారిటీ ఇచ్చిన గోరంట్ల మాధవ్
Gorantla Madhav: న్యూడ్ వీడియో అంతా కుట్ర..న్యాయ పోరాటం చేస్తానన్న ఎంపీ గోరంట్ల మాధవ్..!

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. ఈక్రమంలో ఆయన స్పందించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని..న్యాయం పోరాటం చేస్తానని చెప్పారు. ఇదంతా టీడీపీ కుట్ర అని మండిపడ్డారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వారికి చిత్తశుద్ది ఉంటే తనను నేరుగా ఎదుర్కోవాలని తెలిపారు. న్యూడ్ వీడియోపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు

దీనిపై కచ్చితంగా న్యాయం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఉదయం నుంచి వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడుతున్న టేప్‌ బయటకు వచ్చింది. వీడియోలో న్యూడ్‌గా ఉన్న గోరంట్ల మాధవ్..మహిళతో సున్నితంగా మాట్లాడుతున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో బయటకు రావడంతో వైసీపీలో కలకలం రేగింది.

దీనిపై ఆ పార్టీ నేతలెవరూ స్పందించడం లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్‌లో ఈవీడియో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ నేత ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో రాజకీయ కాక రేపుతోంది. ఆయన తీరుపై ప్రతిపక్షాల నేతలు ఫైర్ అవుతున్నారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆరోపిస్తున్నారు. అరాచకాలకు రాష్ట్రం అడ్డాగా మారుతోందని విమర్శిస్తున్నారు.

గతకొంతకాలంగా వైసీపీ నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, పృథ్వీరాజ్‌ ఆడియో, వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. తాజాగా పార్టీ కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు జరగడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తవుతోంది. అధికార మందంతోనే ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో అర్థరాత్రి అశ్లీల నృత్యాలపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. 

Also read:Viral Video: తప్ప తాగాడు..సాంబారు గిన్నెలో పడ్డాడు..వైరల్‌గా మారిన వీడియో..!

Also read:India vs West Indies: అమెరికాలోనే యధావిధిగా టీ20 మ్యాచ్‌లు..విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటన..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News