Virat Kohli rested and Rohit Sharma left out from ZIM Tour: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్.. త్వరలోనే జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ టీమ్‌ను శనివారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతిని ఇచ్చారు. దాంతో వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్‌గా దుమ్మురేపిన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కే మరోసారి జట్టు బాధ్యతలను అప్పగించారు.
ఫామ్ లేమితో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేస్తారని అందరూ అనుకున్నా.. సెలెక్షన్ కమిటీ అతడి విశ్రాంతి సమయాన్ని పొడిగించింది. రొటేషన్ పాలసీలో భాగంగా సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్‌కు ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇచ్చారు.
గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన పేసర్ దీపక్ చహర్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పునరాగమనం చేశారు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు గాయపడ్డ చహర్ ఇన్నాళ్లకు మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2022లో సత్తాచాటిన రాహుల్ త్రిపాఠి తొలిసారి వన్డేలకు ఎంపికయ్యాడు. శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణలు కొనాగుతున్నారు. ఇక బారిన పడిన కేఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో.. జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాలేదు.
భారత జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మొహ్మద్ సిరాజ్, దీపక్ చహర్.
Also Read: అప్పుడే ఓటీటీలోకి 'పక్కా కమర్షియల్'.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎందులోనో తెలుసా?
Also Read: High Cholesterol Foods: బరువును తగ్గాలనుకునే వారు అస్సలు ఈ ఆహార పదార్థాలను తీసుకోవద్దు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook