Samsaptak Yog Effect: సంసప్తక యోగం ఎఫెక్ట్... ఆగస్ట్ 17 వరకు ఈ రాశులవారికి కష్టకాలం..

Shani-Surya Conjuction:  ఆస్ట్రాలజీలో రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి మధ్య దృష్టి సంబంధం ఏర్పడుతుంది. దీనిని అశుభమైనదిగా భావిస్తారు. సూర్యుడు మరియు శని ముఖాముఖిగా ఉండటం వల్ల కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడతారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 03:26 PM IST
Samsaptak Yog Effect:  సంసప్తక యోగం ఎఫెక్ట్... ఆగస్ట్ 17 వరకు ఈ రాశులవారికి కష్టకాలం..

Samsaptak Yog Bad Effect: సూర్యగ్రహం జూలై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. అదే సమయంలో శనిగ్రహం మకరరాశిలో ప్రవేశించింది. తండ్రీకొడుకులు అయిన ఈ గ్రహాలు ఒకదానికొకటి శత్రువులు. ఇవి రెండు ఎదురుగా ఉండటం వల్ల సంసప్తక యోగం (Samsaptak Yog Effect) ఏర్పడుతుంది. ఈ యోగం 4 రాశుల వారికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఈ సమయం ఈ రాశులకు బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి. అందుకే ఈ రాశుల వారు ఆగస్ట్ 17 వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశులలో జెమిని, సింహం, ధనుస్సు మరియు కుంభం ఉన్నాయి. సూర్యుడు సింహరాశిని పాలించే గ్రహం మరియు శని కుంభరాశిని పాలించే గ్రహం అని మీకు తెలుసు.  

ఈ రాశులపై సంసప్తక యోగం ప్రభావం
>> ఈ అశుభ యోగం వల్ల ఈ రాశుల వారు చాలా విషయాల్లో అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అనేక పెద్ద ఒప్పందాలు రద్దవుతాయి. ఈ సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి.

>> ఉద్యోగంలో పెద్ద వ్యక్తులతో ఏదైనా విషయంలో వాగ్వాదం రావచ్చు. ఉద్యోగం వదిలేసే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి, ఈ సమయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఈ సమయంలో సొంత వ్యాపారం చేసుకోవడం మేలు. 

>> ఈ సంసప్తక యోగం ప్రభావం వల్ల మీరు భారీగా డబ్బు నష్టపోవచ్చు.  వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే ఈ సమయంలో అది మీకు సమస్యగా మారవచ్చు. కాబట్టి కాస్తా జాగ్రత్తగా ఉండండి. 

Also Read: Shani Remedies: శని మహాదశ నుండి బయటపడాలంటే... శనివారం ఈ పరిహారాలు చేయండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News