Janhvi Kapoor Boyfriend: బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తారా.. జాన్వీ కపూర్ ఏం సమాధానం చెప్పారంటే?

Koffee With Karan 7, Karan Johar asks Funny question to Janhvi Kapoor. మీ మాజీ బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తారా? అంటూ కరణ్ అడగ్గానే.. జాన్వీ కపూర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 18, 2022, 10:08 AM IST
  • కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ 2లో జాన్వీ కపూర్ హంగామా
  • బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తారా
  • జాన్వీ ఏం సమాధానం చెప్పారంటే
Janhvi Kapoor Boyfriend: బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తారా.. జాన్వీ కపూర్ ఏం సమాధానం చెప్పారంటే?

Karan Johar asks Funny question to Janhvi Kapoor: 'అతిలోక సుందరి' శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి మంచి పేరు వచ్చింది. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన అందం, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ వరుస సినిమా ఆఫర్లతో ప్రస్తుతం బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ కుర్ర హీరోయిన్ ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే.. మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.

జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. వ్యక్తిగత లైఫ్ ను కూడా బాగ్ ఎంజాయ్ చేస్తారు. ఎప్పటికప్పుడు పార్టీస్, వెకేషన్స్ అంటూ స్నేహితులతో చక్కర్లు కొడుతుంటారు. నిత్యం పార్టీలో కనిపించే జాన్వీ.. తన బెస్ట్ ఫ్రెండ్, స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'కు హాజరయిన విషయం తెలిసిందే. జూలై 7న మొదలైన ఎపిసోడ్ 1లో స్టార్ హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ అలియా భట్ సందడి చేయగా.. ఎపిసోడ్ 2లో జాన్వీ, సారా హంగామా చేశారు. వీరిద్దరితో కరణ్ జోహార్ రచ్చ చేశారు. 

'కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌కు కరణ్ జోహార్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే జాన్వీవి ఓ కష్టమైన ప్రశ్న ఎదురైంది. 'మీ మాజీ బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తారా?' అంటూ కరణ్ అడగ్గానే.. జాన్వీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆపై తేరుకుని 'లేదు.. నేను మళ్లీ గతంలోకి వెళ్లలేను' అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చారు. ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో తోబుట్టువులతో మీరు డేటింగ్ చేసారు కదా అని ఇదే ఎపిసోడ్‌లో జాన్వీ, సారాలను కరణ్ అడిగిన విషయం తెలిసిందే. 

ఇదే షోలో మీరు ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అని జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ను కరణ్ జోహార్ అడిగాడు. ఈ ప్రశ్నకు టాలీవుడ్ రౌడీ హీరో 'విజయ్ దేవరకొండ' అని సారా సమాధానం చెప్పగా.. జాన్వీ వైపు కరణ్ చూడగానే విజయ్ దేవరకొండ అని చెప్పారు. దాంతో ఇద్దరు యువ హీరోయిన్స్ ఒకరినొకరు చూసుకంటూ నవ్వుకున్నారు. మొత్తానికి  'కాఫీ విత్ కరణ్' ఎపిసోడ్ 2 జాన్వీ, సారాల అల్లరితో యమ హుషారుగా సాగింది.  

Also Read: Gold Price Today July 18: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే

Also Read: Horoscope Today July 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించిన ధన లాభం!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News