Weight Loss Drinks: మీరు బరువు పెరుగుతున్నారా..అయితే ఈ డ్రింక్స్‌ను ట్రై చేయండి..!!

Weight Loss Drinks: వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం చాలా మంది మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల బరువు పెరగి..అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2022, 01:13 PM IST
  • మీరు బరువు పెరుగుతున్నారా..
  • అయితే ఈ డ్రింక్స్‌ను ట్రై చేయండి
  • బరువు తగ్గడానికి ఈ డిటాక్స్ డ్రింక్స్‌ సహాయపడతాయి
Weight Loss Drinks: మీరు బరువు పెరుగుతున్నారా..అయితే ఈ డ్రింక్స్‌ను ట్రై చేయండి..!!

Weight Loss Drinks: వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం చాలా మంది మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల బరువు పెరగి..అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సీజన్‌లో డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఫ్యాట్‌ను కరగడమే కాకుండా మెటబాలిజం టాక్సిన్స్ కూడా బయటకు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

బరువు తగ్గడానికి ఈ డిటాక్స్ డ్రింక్స్‌ను తాగండి:

1. దాల్చిన చెక్క, ఆపిల్‌తో డిటాక్స్ డ్రింక్స్‌:

దీనిని తయారు చేసుకోవడానికి.. ఆపిల్ రసం, దాల్చిన చెక్క పొడిని నీటిలో కలపండి. అంతే కాకుండా ఇందులో ఒక టీ స్పూన్‌ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కూడా కలపండి. దీనిని క్రమం తప్పకుండా దీనిని తాగడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది.

2. కొత్తిమీర, జీలకర్రతో డిటాక్స్ డ్రింక్స్‌:

ఈ డిటాక్స్ డ్రింక్‌ను చేయడానికి.. ఒక గ్లాసు నీటిలో సోపు, అర టీస్పూన్ జీలకర్ర, రాత్రంతా నానబెట్టి  కొత్తిమీర ఫైన్‌గా దంచుకుని నీటిలో కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న డ్రింక్‌ను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి బరువు కూడా తగ్గుతుంది.

3. కొబ్బరి నీరు, పుదీనా, నిమ్మకాయతో డిటాక్స్ డ్రింక్స్‌:

ఈ డిటక్స్‌ వాటర్‌ను తయారు చేసుకోవాడానికి ముందుగా.. కొబ్బరి నీరు, పుదీనా ఆకులు, ఒక నిమ్మకాయ, ఒక చెంచా తేనెను సిద్ధం చేసుకోవాలి. వీటిని ఫైన్‌ పెస్ట్‌ చేసి మిశ్రమాన్ని కొబ్బరి నీళ్లలో కలుపుకోవాలి. ఇలా చేసిన డ్రింక్‌ను క్రమం తప్పకుండా ఉదయాన్నే తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

4. క్యారెట్లు, నారింజతో డిటాక్స్ డ్రింక్స్‌:

నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.  అంతేకాకుండా క్యారెట్‌లో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కావున ఈ రెండిటిని మిక్స్ చేసి డ్రింక్ తయారు చేసి తాగండి. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Lychee Peel Benefits: లిచీ తొక్కలతో శరీరానికి ఎన్నిప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Also Read: Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నారా..ఈ దుష్ప్రభావాలు తప్పవు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News