Sun Transit Effect On Zodiac: సూర్యుని రాశి మార్పు అన్ని రాశులపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మే 15న సూర్యుడు మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు వృషభ రాశిలోకి (Sun Transit In Taurus 2022) ప్రవేశించడాన్ని 'వృషభ సంక్రాంతి' (Vrishabha Sankranti) అంటారు. దీని తరువాత, సూర్యుడు రాబోయే 30 రోజులు వృషభరాశిలో ఉంటాడు. ఈ సూర్య సంచారం (Sun Transit) ఏ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
వృషభం (Taurus): సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీని ప్రభావం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సూర్య సంచారం ఈ రాశి వారికి చాలా ప్రయోజనాలను తెస్తుంది. ఉద్యోగం చేసే వ్యక్తులు కెరీర్‌లో విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. అదే సమయంలో వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. మొత్తానికి ఈ రాశి వారికి మంచి కాలం ప్రారంభం కానుంది.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి సూర్యుని రాశి మార్పు శుభప్రదం అవుతుంది. వారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. వీరు ఆర్థిక పురోగతిని సాధించవచ్చు. వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం. విజయం సిద్ధిస్తుంది.
సింహం (Leo): వృషభరాశిలో సూర్యుని ప్రవేశం సింహరాశి వారికి లాభిస్తుంది. వారు తమ కెరీర్‌లో గొప్ప పురోగతిని పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. మీరు తండ్రి నుండి గొప్ప సహాయం పొందవచ్చు. వ్యాపారాలు చేసే వారు లాభపడతారు.
కన్య (Virgo): సూర్యుని సంచారము కన్యా రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వారి జీవితంలో మంచి రోజులు వస్తాయి. మీరు పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. పని విషయంలోనూ, డబ్బు విషయంలోనూ గతంతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు వారికి అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేయడం ప్రారంభిస్తారు.
Also Read: Chandra Grahan 2022: మే 16న మెుదటి చంద్రగ్రహణం...గర్భిణీ స్త్రీలు ఈ 5 పనులు చేయకూడదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook