Tulsi Water Benefits: తులసి నీళ్లతో మధుమేహం తగ్గించుకోవచ్చని తెలుసా

Tulsi Water Benefits: మీరు మధుమేహంతో బాధపడుతున్నారా..వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారా..అయితే మీకిది అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఆ మొక్క ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా దోహదపడుతుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 5, 2022, 07:39 PM IST
  • తులసి నీళ్లతో డయాబెటిస్‌కు చెక్
  • తులసి ఆకుల్ని నీళ్లలో ఉడికించి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవించాలి
  • తులసి ఆకులకు, తులసి నీళ్లకు ఆయుర్వేదంలో ఎనలేని ప్రాధాన్యత
Tulsi Water Benefits: తులసి నీళ్లతో మధుమేహం తగ్గించుకోవచ్చని తెలుసా

Tulsi Water Benefits: మీరు మధుమేహంతో బాధపడుతున్నారా..వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారా..అయితే మీకిది అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఆ మొక్క ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా దోహదపడుతుంది.

బ్లడ్ షుగర్ అనేది చాలా ప్రమాదకరం. బ్లడ్ షుగర్ స్థాయి పెరిగేకొద్దీ మీరు డయాబెటిక్ పేషెంట్‌గా మారిపోతారు. ఆయుర్వేదంలో మంచి ప్రత్యామ్నాయం ఉందంటున్నారు వైద్యులు. సరైన ఆహారపు అలవాట్లు, మెరుగైన జీవనశైలితో చాలావరకూ రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటే..బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించవచ్చు. అయితే తులసి నీళ్లతో బ్లడ్ షుగర్ తగ్గించుకోవచ్చని చాలా తక్కువ మందికి తెలుసు. తులసి ఆకుల నీళ్లను మధుమేహం తగ్గించేందుకు ఎలా వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లడ్ షుగర్ నియంత్రణలో తులసి నీరు...

తులసి నీళ్ళతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను చాలా వరకూ నియంత్రించవచ్చు. ఓ గ్లాసు నీళ్లలో తులసి ఆకులు కొన్ని వేసి ఉడికించాలి. ఆ తరువాత ఆ నీటిని వడపోసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

ఇది కాకుండా తులసి నీళ్లతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. తులసి నీళ్లు జలుబు, దగ్గు తగ్గించేందుకు అద్భుతమైన ఔషధంగా ఉపయోపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఆధునిక పోటీ ప్రపంచంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు తులసి ఆకులు గానీ, తులసి నీళ్లు గానీ మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. తులసి ఆకులతో టీ కూడా చేసుకుని తాగవచ్చు. 

Also read: Cholesterol increases Sign: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఈ ప్రమాదం తప్పదు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x