Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు వివాహం, గృహ ప్రవేశం, షాపింగ్ వంటి వాటికి శుభ సమయంగా భావిస్తారు. ఈ ఏడాది మే 3 (మంగళవారం)న అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ప్రతీ ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ నాడు ఈ పండగ జరుపుకుంటారు. ఈసారి అక్షయ తృతీయ నాడు 3 రాజయోగాలు ఏర్పడటంతో పండగ మరింత ప్రత్యేకత సంతరించుకుంది.
పవిత్ర నది స్నానం :
అక్షయ అంటే క్షీణించనిది... ఎన్నటికీ తరగనిది అని అర్థం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అనంతమైనది. అక్షయ తృతీయ నాడు చేసే పనులు అనంత శుభాలు కలగజేస్తాయని నమ్ముతారు. అయితే ఇందుకోసం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. ముఖ్యంగా నది స్నానం చేయేడం, విష్ణువు-లక్ష్మీ దేవతలను పూజించడం, ఇతరులకు దానాలు సమర్పించడం వంటివి చేయాలి. ఇలా చేస్తేనే భక్తులకు అక్షయ తృతీయ అక్షయమైన ఫలితాలను ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇల్లు, కారు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంపద, ఐశ్వర్యం సిద్ధిస్తాయి.
అక్షయ తృతీయ.. 3 రాజయోగాలు...
ఈసారి అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైనది. మే 3న రానున్న ఈ అక్షయ తృతీయ గ్రహాల స్థానం ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. ఈరోజున మాళవ్య రాజయోగం, హంస రాజయోగం, శష రాజయోగం ఏర్పడుతున్నాయి. అక్షయ తృతీయ నాడు ఈ రాజయోగాలు ఏర్పడటం చాలా శుభప్రదం. ఈ రాజయోగంలో ఏ శుభ కార్యం చేపట్టినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన కొనుగోళ్లు కలిసొస్తాయి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Ruturaj Gaikwad Record: బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌తో సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.