Enforcement Directorate: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీకి షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. ఫారిన్ ఎక్సేంజ్ కేసులో పెద్ద ఎత్తున నిధులను సీజ్ చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మీ కి షాక్ తగిలింది. ఫారిన్ ఎక్సేంజ్ కేసులో రూ. 5,551 కోట్ల రూపాయలను సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. భారత్ నుంచి అక్రమమార్గాల్లో రెడ్మీ ఇండియా ... నిధులను మళ్లించిందన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. దీనిపై ఆధారాలుసేకరించిన ఈడీ నిధులను స్తంభింపజేసింది. చైనాకు చెందిన షావోమీ సంస్థ.. మన దేశంలో షావోమీ ఇండియా పేరుతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ నుంచి మాతృసంస్థ అయిన షావోమీకి రాయల్టీ రూపంలో అక్రమమార్గంలో నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను మళ్లించడానికి మూడుసంస్థల పేర్లను వాడుకుంది షావోమీ ఇండియా. అయితే సదరు సంస్థలనుంచి రెడ్మీ ఇండియా ఎలాంటి సేవలూ పొందలేదని ఈడీ దర్యాప్తులో తేలింది. ఫెమాలోని సెక్షన్ 4 ప్రకారం షావోమీ నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం షావోమీకి మూడురెట్ల జరిమానా విధించే అవకాశముంది.
గత ఏడాది కూడా చైనీస్ మొబైల్ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. టాక్స్ ఎగవేశారనే ఆరోపణలతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అటు ప్రభుత్వం కూడా చైనీస్ మొబైళ్ల పలు అప్లికేషన్లను భారత్ లో నిషేధించింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే కారణంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పుడు మరోసారి ఫెమా నిబంధనల ఉల్లంఘన పేరుతో ఈడీ కఠిన చర్యలు తీసుకుంది. రెడ్మీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దాదాపు 22 శాతం రెడీ మీ మొబైళ్లు అమ్ముడుపోతున్నాయి.
Also Read: Vijay in AK 62: స్టార్ హీరో సినిమాలో విలన్‌గా విజయ్.. ముచ్చటగా మూడోసారి!
Also Read: China Corona: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు... క్వారెంటైన్ కేంద్రాల్లో ప్రజలు ఇబ్బందులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook