Virat Kohli sends special wishes to Rohit Sharma for MI Captain celebrating 35th birthday: 2007 భారత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ.. 15 ఏళ్ల పాటు టీమిండియాతో ప్రయాణం చేస్తున్నాడు. 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఇప్పటి వరకు 15,733 పరుగులు చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. భారీ సిక్సులకు పెట్టింది పేరైన రోహిత్‌కు.. హిట్‌మ్యాన్ అనే బిరుదు ఉంది. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఏకైక కెప్టెన్ కూడా రోహిత్. ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ నేడు (ఏప్రిల్ 30) 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
రోహిత్ శర్మ పుట్టిన రోజు సందర్భంగా హిట్‌మ్యాన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు, సహచరులు, ఫాన్స్, కుటుంబ సభ్యులు రోహిత్‌కు బర్త్ డే విషెష్ చెపుతున్నారు. దాంతో నెట్టింట రోహిత్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. హిట్‌మ్యాన్‌కు ప్రత్యేక విషెస్ చెప్పాడు. ఇద్దరు కలిసున్న ఫొటో పంచుకొని 'హ్యాపీ బర్త్‌డే రోహిత్.. గాడ్ బ్లెస్ యూ' ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేశాడు.
ఐపీఎల్ 2022లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు పరుగులు చేయలేక విమర్శల పాలవుతున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 19.13 సగటుతో 153 పరుగులు మాత్రమే చేశాడు. బెంగళూరు బ్యాటర్ కోహ్లీ మెగా టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 16 సగటుతో 128 పరుగులే చేశాడు. అయితే ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో కోహ్లీ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు 20 బంతుల్లో 26 రన్స్ చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ, హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'హ్యాపీ బర్త్‌డే రో.. సమీ. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. మా హకూనా మటాటాగా ఉన్నందుకు థాంక్స్' అని రితికా ట్వీట్ చేశారు. ఈ ట్వీటుకు రోహిత్ శర్మ, కూతురు సమైరాతో కలిసి తాను ఉన్న ఫొటోలు పంచుకున్నారు.
Also Read: Vijay in AK 62: స్టార్ హీరో సినిమాలో విలన్‌గా విజయ్.. ముచ్చటగా మూడోసారి!
Also Read: Funny Video: అసలే సమ్మర్, ఆపై విద్యుత్ కోతలు.. ఉక్కపోత తట్టుకోలేక ఈ వ్యక్తి ఏం చేశాడో చుడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook