ట్విట్టర్ కొత్త సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జాక్‌ డోర్సీ

ఎలన్‌ మస్క్ ట్వీటర్‌ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారిని పెట్టుకునేందుకు ఎలన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నారు. 

Last Updated : Apr 30, 2022, 03:14 PM IST
  • ట్విట్టర్ లో పలు కీలక మార్పులు
  • ఉన్నత ఉద్యోగులను మారుస్తున్న మస్క్
  • సీఈఓగా జాక్ డోర్సీకి అవకాశం
ట్విట్టర్ కొత్త సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జాక్‌ డోర్సీ

Twitter Chairman Dorsey ?  ఎలన్‌ మస్క్ ట్వీటర్‌ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారిని పెట్టుకునేందుకు ఎలన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నారు. కొంత మంది స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోతుండగా మరికొంత మందిని బలవతంగా రాజీనామా చేయిస్తున్నారు. కీలక పదవుల్లో తనకు సన్నిహితంగా ఉండే వారిని నియమించుకుంటున్నారు ఎలన్ మస్క్. ట్వీట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ తప్పుకున్న తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానంలో ట్విట్ట‌ర్‌లో కో-ఫౌండ‌ర్, మాజీ సీఈవో జాక్ డోర్సీ కీల‌క బాధ్య‌త‌లు వ‌హించ‌బోతున్నారని సమాచారం. ట్విట్ట‌ర్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాల‌న్న మ‌స్క్ ప్లాన్‌ నిర్ణయానికి డోర్సీ మద్ధతు ఇవ్వడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. ట్విట్ట‌ర్‌లో జాక్ డోర్సీకి 2.36 శాతం వాటాలు ఉన్నాయి.

అనివార్య కారాణాల వల్ల ఐదు నెలల కిందట సీఈవోగా తప్పుకున్న డోర్సీ.. తిరిగి ఆ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారని వార్తలు వస్తున్నాయి. ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసిన ఎల‌న్‌మ‌స్క్‌కు, జాక్ డోర్సీకి మ‌ధ్య స్నేహ పూర్వ‌క సంబంధాలు ఉన్నాయని సమాచారం. దీనికి తోడు డోర్సీకి ట్విట్టర్‌లో సీఈఓగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో ఆయన వైపే మస్క్ మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.  ట్విట్ట‌ర్‌ను టేకోవ‌ర్ చేసుకుంటాన‌ని తొలుత ప్ర‌క‌టించిన‌ప్పుడు ప్ర‌స్తుత ఆ సంస్థ యాజ‌మాన్యంపై త‌న‌కు విశ్వాసం లేద‌ని మ‌స్క్ చెప్పారు. దీంతో ప్ర‌స్తుత సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్ స్థానం సుర‌క్షితం కాద‌నే అభిప్రాయం వినిపిస్తున్న‌ది. 

ట్వీట్టర్‌ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తూ...ట్విట్ట‌ర్ ఇండియా మాజీ అధిప‌తి మ‌నీశ్ మ‌హేశ్వ‌రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  డోర్సీకే మళ్లీ సీఈఓ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వార్తలను బలపరుస్తూ.... డోర్సీ చైనా అన‌లిస్ట్‌లు కూడా ఆయన పేరే వినిపిస్తున్నారు.  ప్ర‌స్తుత సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్ కు ట్వీట్టర్‌ తో పదేళ్లకు పైగా అనుబందం ఉంది. ఒకప్పుడు చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌గా ప‌ని చేసిన పరాగ్ అగర్వాల్ సీఈవోగా ప్ర‌మోట్ అయ్యారు. మరోవైపు  ట్విట్టర్ ఉద్యోగులు కూడా పరాగ్ అగర్వాల్ వైపే ఆసక్తి కనబరుస్తున్నారు. కాని మస్క్ మాత్రం పరాగ్ అగర్వాల్ పై తనకు నమ్మకం లేదని ప్రకటించడంతో ఆయన మార్పు తప్పనిసరి అయింది. 
 

also read   Wipro profits increase లాభాల పంట పండిస్తున్న విప్రో... 10.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు

alsor read ఐడీబీఐ బ్యాంకును అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ ,

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News