Director Krish Launches Ranasthali Movie First Look Poster: హీరో నాగశౌర్య నటించిన అశ్వథ్థామ సినిమాకి మాటల రచయితగా పనిచేసిన పరుశరాం శ్రీనివాస్ దర్శకత్వంలో సురెడ్డి విష్ణు నిర్మించిన చిత్రం 'రణస్థలి'. సురెడ్డి విష్ణు సమర్పణలో ఏజె ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో ధర్మ, ప్రశాంత్, శివ జామి ,నాగేంద్ర, విజయ్ రాగం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నపూర్ణ స్టుడియోస్లో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగార్లమూడి చేతుల మీదుగా మంగళవారం రిలీజ్ అయింది.
ఈ సందర్భంగా జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ... 'రణస్థలి సినిమా రఫ్ కట్ టీజర్ చూస్తుంటే టైటిల్‌కు తగ్గట్టుగా సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. చిన్న సినిమాలో ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా పూర్తిచేసి.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకునే టీం తపన నాకు చాలా నచ్చింది. డైలాగ్స్ వింటుంటే కేజీఎఫ్ లెవెల్లో ఇంపాక్ట్ ఇస్తున్నాయి. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా టీం అందరికీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు.
దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... 'మా రణస్థలి చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు క్రిష్ గారికి ధన్యవాదాలు. మేము క్రిష్ గారికి రఫ్ కట్ టీజర్‌ను చూపించడం జరిగింది. అది చూసి హర్షం వ్యక్తం చేశారు.యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు. ప్రతి క్యారెక్టర్లో ఆర్టిస్టులు కనిపించరు. సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత వారి క్యారెక్టర్లు మీతోనే ఉంటాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బయటకు వచ్చిన తరువాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా సినిమా చూసిన తరువాత ప్రేక్షకులకు చిన్న సినిమాపై వుండే చులకన భావం పోయేలా మా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. సంగీత దర్శకుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన సురెడ్డి విష్ణుకు ధన్యవాదాలు. రణస్థలి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాము' అని పేర్కొన్నారు.
నిర్మాత సురెడ్డి విష్ణు మాట్లాడుతూ... 'డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న రణస్థలి చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడి పూర్తి చేశాము. నటీనటులు, టెక్నిసిషన్స్ అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. రణస్థలి సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి అనుభూతిని పొందుతారని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని తెలిపారు.
Also Read: Cholesterol Reducing Dry Fruits: శరీరంలో అధిక కొలెస్ట్రాల్ నివారణ కోసం ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.