Petrol Diesel prices: పెరిగిన ధరల దెబ్బకు.. తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం!

Petrol Diesel prices: దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు మొదలుకుని ఇతర అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అయితే ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ వినియోగం ఈ నెల భారీగా తగ్గినట్లు తెలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2022, 11:13 AM IST
  • దేశంలో తగ్గిన ఇంధన వినియోగం
  • పెట్రోల్​ వినియోగం 10 శాతం డౌన్​
  • దాదాపు 16 శాతం తగ్గిన డీజిల్ విక్రయాలు
Petrol Diesel prices: పెరిగిన ధరల దెబ్బకు.. తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం!

Petrol Diesel prices: దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గత 11 రోజులుగా పెరుగుదల లేనప్పటికీ.. ధరలు ఇంకా రికార్డు స్థాయి వద్దే ఉన్నాయి. దీనితో సాధారణ ప్రజలుకు ఇంధనల ధరలతో సతమమతమవుతున్నారు. రేట్లు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం క్రమంగా తగ్గుతోందని వార్తలు వస్తున్నాయి. 

ఈ నెలలో ఇంధన వినియోగం ఇలా..

దేశవ్యాప్తంగా ఈ నెల తొలి 16 రోజుల్లో గత నెల (2022 మార్చి) ఇదే సమయంతో పోలిస్తే.. పెట్రోల్ వినియోగం దాదాపు 10 శాతం, డీజిల్ వినియోగం ఏకంగా 15.6 శాతం మేర తగ్గినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మరోవైపు వంట గ్యాస్ వినియోగం కూడా 1.7 శాతం మేర తగ్గినట్లు తెలిసింది.

ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు ఏప్రిల్ తొలి 15 రోజుల్లో 1.12 మిలియన్ టన్నుల పెట్రోల్​ విక్రయాలను నమోదు చేశాయి. 2021తో పోలిస్తే ఈ మొత్తం 12.1 శాతం అధికం అయినప్పటికీ..  2022 మార్చితో పోలిస్తే మాత్రం 9.7 శాతం తక్కువని గణాంకాలు చెబుతున్నాయి.

డీజిల్ విషయానికొస్తే ఈ నెల 1-15 మధ్య దాదాపు 3 మిలియన్​ టన్నుల విక్రయాలను సాధిచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. గత నెలలో ఇదే సమయంలో 3.53 మిలియన్ టన్నుల డీజిల్ వినియోగమవటం గమనార్హం. అంటే దాదాపు 15.6 శాతం మేర డీజిల్ విక్రయాలు తగ్గాయి.

పెరిగిన ధరలే కారణం!

ఇంధన ధరలు క్రితంతో పోలిస్తే భారీగా పెరిగిన నేపథ్యంలో.. వినియోగం భారీగా పడిపోయిందని చెబుతున్నారు విశ్లేషకులు. దీనికి తోడు డీజిల్ ధర పెరగటం వల్ల రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని.. ఈ ప్రభావం అన్ని వస్తు, సేవలపైనా పడిందని అంటున్నారు.

వంట నూనె సహా ఇతర నిత్యవసరాల ధరలు పెరిగేందుకు ఇది కూడా ఓ ప్రధాన కారణమని చెబుతున్నారు విశ్లేషకులు.

Also read: Todays Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలో ఏప్రిల్ 16 ఇవాళ్టి బంగారం ధరలు

Also read: iPhone offer: రూ.59,900గా వేల ఐఫోన్ 12 మిని..రూ.30వేల కన్నా తక్కువ ధరకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News