AP Health Minister: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ కొలువుదీరింది. కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు పూర్తయింది. కొత్త కేబినెట్లో ఆసక్తికర అంశం కన్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాత, కొత్త కలయికతో కేబినెట్ కూర్పు పూర్తయింది. కొత్తగా 13 మంది మంత్రులయ్యారు. వివిధ సామాజిక సమీకరణాలు, ప్రాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు అనంతరం ఏర్పర్చిన కొత్త కేబినెట్. ఈ కొత్త కేబినెట్లో ఓ ఆసక్తికర అంశం కన్పిస్తోంది. ఆ అంశం తెలంగాణలోని ఆ గ్రామస్థుల ఆనందానికి కారణమైంది.
ఏపీ కొత్త కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్న చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి. సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉంటే విడదల రజని స్వస్థలం తెలంగాణ కావడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపురం గ్రామం విడదల రజని స్వస్థలం. ఈ గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వలస వెళ్లారు. అతని రెండవ కూతురు రజనిని అప్పట్లో ఏపీకు చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది. ఆ తరువాత ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి..ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
సుదీర్ఘకాలంగా చిలకలూరిపేటలోనే ఉంటూ..ఇక్కడి ప్రజలతే మమేకమై..అవినాభావ సంబంధాలు కలిగిన విడదల రజని ఏపీ బిడ్డగానే ఉంటారు. అయితే కుటుంబనేపధ్యం తెలంగాణ కావడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ పొరుగురాష్ట్రంలో మంత్రి అయినందుకు.
Also read: Stampede in Tirumala: తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు.. తొక్కిసలాటలో భక్తులకు గాయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook