Imran Khan Praises India: సందర్భం వచ్చిన ప్రతీసారి అంతర్జాతీయ వేదికలపై సైతం భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... తొలిసారి అందుకు విరుద్ధంగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానం ఉత్తమమైనదని, స్వతంత్రమైనదని కితాబిచ్చారు. భారత్‌కు తాను సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. పాకిస్తాన్ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమైన తరుణంలో ఇమ్రాన్ నోట భారత్‌పై ప్రశంసలు వ్యక్తమవడం గమనార్హం.
తాజాగా ఖైబర్ పంక్తుంఖ్వాలోని మలకంద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. 'నేను మన పొరుగు దేశం భారత్‌ను ప్రశంసిస్తున్నాను. భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉంది. క్వాడ్‌లో భారత్ భాగస్వామ్య దేశమైనప్పటికీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో ఆ దేశం తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. అమెరికా రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. ఇప్పటికీ ఆ దేశం నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే భారత్ అనుసరిస్తున్న విదేశాంగ పాలసీ వారి ప్రజల మేలు కోసం..' అంటూ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఇమ్రాన్ సర్కార్ సొంత పార్టీ నుంచే తీవ్ర అసమ్మతిని, వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇటీవల పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 28న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే ఇమ్రాన్‌కు 172 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఇమ్రాన్ పార్టీకి 155 మంది ఎంపీల మద్దతు ఉంది. ఆరు ఇతర పార్టీలకు చెందిన 23 మంది ఎంపీలు ఇమ్రాన్ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. అయితే సొంత పార్టీ నుంచే 24 మంది రెబల్స్‌గా మారారు. రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. వారు దారికొచ్చే సూచనలు కనిపించట్లేదు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also read: Bhagwant Mann: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం... కొత్త మంత్రులకు షాకింగ్ న్యూస్..
Also read: Karnataka Hijab Row: హిజాబ్‌పై తీర్పు వెలువరించిన జడ్జిలకు 'వై' కేటగిరీ భద్రత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook