Dr Subhash Chandra's Interview: జీ డిజిటల్‌కి 1 బిలియన్ యూజర్స్, వియాన్‌కి 500 మిలియన్ల వ్యూయర్స్, రుణాలు, డిష్ టీవి-యస్ బ్యాంక్ వివాదంపై డా సుభాష్ చంద్రతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Essel Group Chairman Dr Subhash Chandra's Exclusive Interview: జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్వి చేసిన ఈ స్పెషల్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఎస్సెల్ గ్రూప్ సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యులు డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. జీ గ్రూప్ విజన్ ఏంటి ? జీ మీడియా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, జీల్-సోని విలీనం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం...

Written by - ZH Telugu Desk | Edited by - Pavan | Last Updated : Mar 16, 2022, 08:54 PM IST
  • రాబోయే 3 సంవత్సరాలలో జీ డిజిటల్‌కి 1 బిలియన్ యూజర్స్
  • జీల్ - సోని విలీనం ప్రక్రియ ఎక్కడి వరకొచ్చింది ?
  • యూట్యూబ్‌లో బీబీసీ కంటే ముందున్న వియాన్
Dr Subhash Chandra's Interview: జీ డిజిటల్‌కి 1 బిలియన్ యూజర్స్, వియాన్‌కి 500 మిలియన్ల వ్యూయర్స్, రుణాలు, డిష్ టీవి-యస్ బ్యాంక్ వివాదంపై డా సుభాష్ చంద్రతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Essel Group Chairman Dr Subhash Chandra's Exclusive Interview: జీ మీడియాలో ఏం జరుగుతోంది ? ఎస్సెల్ గ్రూప్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి ? జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రెజెస్ లిమిటెడ్, సోని పిక్చర్స్ విలీనం ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే సందేహాలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్వి (Zee Business' Managing Editor Anil Singhvi). అనిల్ సింగ్వి చేసిన ఈ స్పెషల్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఎస్సెల్ గ్రూప్ సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యులు డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. జీ గ్రూప్ విజన్ ఏంటి ? జీ మీడియా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, జీల్-సోని విలీనం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం...

రాబోయే ఐదేళ్ల కాలానికి జీ మీడియా ప్రణాళికల గురించి డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సానుకూల వాతావరణం ఉందని అన్నారు. అనేక అంశాలపై మరింత ముందుకు వెళ్లేందుకు మేము దృష్టిసారిస్తున్నామని తెలిపారు.  
 
Mayaverse - Metaverse - మెటావర్స్ కాదు.. ఇది మాయావర్స్..
ఇటీవల కాలంలో క్రేజ్ పుంజుకుంటున్న మెటావర్స్, క్రిప్టో, ఎన్‌ఎఫ్‌టీ సంస్కృతి గురించి డాక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ, " ఇది ఇంటర్నెట్ యుగం కనుక దీనిని మెటావర్స్ అనడం కంటే మాయావర్స్' అని పిలవడమే ఉత్తమం అనేది తన అభిప్రాయం అన్నారు.
 
Zee Digital users - రాబోయే 3 సంవత్సరాలలో జీ డిజిటల్‌కి 1 బిలియన్ యూజర్స్:
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జీ మీడియాకు ప్రస్తుతం 300 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారని గుర్తుచేసిన డాక్టర్ చంద్ర.. రాబోయే 3 సంవత్సరాలలో 1 బిలియన్ యూజర్స్‌ని జోడించాలని ఎస్సెల్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అంతేకాకుండా "డిజిటల్ కంటెంట్‌ను మానిటైజ్ చేయడంపై సైతం జీ మీడియా దృష్టి సారించినట్టు" డా చంద్ర వెల్లడించారు.

Debt resolution - రుణాల సమస్యకు పరిష్కారం
రుణాల సమస్యకు పరిష్కారంతో పాటు ప్రస్తుత పరిస్థితి గురించి డాక్టర్ చంద్ర మాట్లాడుతూ, "ప్రమోటర్ స్థాయిలో రుణ భారాన్ని 92 శాతం తగ్గించామని... మిగతా రుణం కూడా మరో 1 లేదా 2 నెలల్లో చెల్లించడం జరుగుతుంది'' అని ధీమా వ్యక్తంచేశారు. ఎస్సెల్ గ్రూప్ ఇన్‌ఫ్రా బిజినెస్‌లోకి అడుగుపెట్టడాన్ని ఒక పొరపాటుగా డా చంద్ర అభివర్ణించారు. 

Dish TV-Yes Bank matter - డిష్ టీవీ-యస్ బ్యాంక్ వివాదం:
డిష్ టీవీ - యస్ బ్యాంక్ మధ్య తలెత్తిన వివాదంపై డాక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ, యస్ బ్యాంక్ పాత మేనేజ్‌మెంట్ తమను మోసం చేసిందని అన్నారు. బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియకే ఏవేవో ఊహాగానాలు ప్రచారం అయ్యాయని చెప్పుకొచ్చిన ఆయన.. "డిష్ టీవీ-యస్ బ్యాంక్ విషయంలో మీడియాలో చాలా మందికి అసలు విషయం తెలియదని అన్నారు.

ZEEL-Sony Merger - జీల్ - సోని విలీనం:
జీల్ సోని విలీనం గురించి డా చంద్ర మాట్లాడుతూ.. " జీ ఎంటర్‌టైన్మెంట్, సోని విలీనం ప్రక్రియ ప్రస్తుతం సరైన దిశలోనే వెళ్తుందని.. ఇంకొంత అధికారిక ప్రక్రియ పూర్తయితే విలీనం ప్రక్రియ కూడా పూర్తవుతుంది'' అని తెలిపారు.

New Business - మరేదైనా కొత్త వ్యాపారం చేసే ఆలోచన ?
ఎస్సెల్ గ్రూప్‌కి మరేదైనా కొత్త బిజినెస్ చేసే ఆలోచన ఉందా అని అనిల్ సింగ్వి ప్రశ్నించగా.. "లాభాపేక్ష కోసం మేమెప్పుడూ, ఎలాంటి వ్యాపారాలు చేయలేదని... ఏదైనా కొత్త కోణంలో ప్రయత్నం చేసి అందులో విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వ్యాపారాలు ప్రారంభించామని డా సుభాష్ చంద్ర స్పష్టంచేశారు.

జీ మీడియా పర్‌ఫార్మెన్స్, వియాన్, జీ డిజిటల్:
జీ మీడియా పర్‌ఫార్మెన్స్, వియాన్, జీ డిజిటల్ ఆపరేషన్స్ గురించి డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. " జీ మీడియాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రస్తుతం 300 మిలియన్ యూజర్స్ ఉన్నారని సగర్వంగా చెప్పారు. అలాగే జీ మీడియా సొంతమైన వియాన్ ఛానెల్‌కి సైతం (WION) ఆసియాలోనే తొలి గ్లోబల్ నెట్‌వర్క్‌గా గుర్తింపు సంపాదించుకున్నట్టు తెలిపారు. అంతేకాదు.. వియాన్ ఛానెల్ ఇండియా నుంచి నెంబర్ 1 ఇంటర్నేషనల్ ఛానెల్‌గానూ గుర్తింపు పొందినట్టు గుర్తుచేశారు. విదేశాల్లో వియాన్‌కి 58 శాతం ఆడియెన్స్ ఉన్నట్టు డా చంద్ర వెల్లడించారు.

యూట్యూబ్‌లో బీబీసీ కంటే వియాన్ ముందుంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో వియాన్‌ 500 మిలియన్ల వీక్షకులను సొంతం చేసుకోవాలనేది వియాన్ ప్రణాళికగా చెప్పారు.

Message to shareholders - షేర్‌హోల్డర్లకు డా చంద్ర ఇచ్చే సందేశం:
ఈ సందర్భంగా కంపెనీ షేర్ హోల్డర్లకు ఏమైనా సందేశం ఇస్తారా అనే ప్రశ్నకు డా సుభాష్ చంద్ర (Essel Group Chairman Dr Subhash Chandra) స్పందిస్తూ.. కొంతమంది వాటాదారులు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ.. వాటాదారుల సంక్షేమాన్ని కంపెనీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని అన్నారు.

Bouncing back - మరింత ఉత్సాహంతో..
ఇబ్బందులు ఎదురైన ప్రతీసారి మరింత నూతనొత్తేజంతో తిరిగొస్తారు కదా.. మరి ఈసారి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అని ప్రశ్నించగా... ఈసారి త్వరలోనే సాంకేతిక రంగంలో కొత్త ఐడియాతో జనం ముందుకు వచ్చే ఆలోచనలు ఉన్నాయని స్పష్టంచేశారు.

Also read : Zee Media: జీ మీడియా అమ్మకం.. అందులో నిజం లేదన్న కంపెనీ మేనేజ్‌మెంట్

Also read : ZEE Launches New Channel: జీ తెలుగు డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రారంభం.. నిజాన్ని నిక్కచ్చిగా మీముందుకు తీసుకొస్తాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News