Redmi Smart LED TV X43 Offer: 14 వేల బంపరాఫర్.. అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ!!

Redmi Smart LED TV X43 Amazon Offer: రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 43 టీవీ అసలు ధర 42,999గా ఉండగా.. అమెజాన్‌లో 14 వేలను తగ్గించి రూ.28,999గా నిర్ణయించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 06:00 PM IST
  • 14 వేల బంపరాఫర్
  • అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ
  • నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు
Redmi Smart LED TV X43 Offer: 14 వేల బంపరాఫర్.. అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ!!

Redmi Smart LED TV X43 Amazon Offer: ఒకప్పుడు స్మార్ట్ టీవీ కొనాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అదే 43, 50, 55, 65 అంగుళాల టీవీ కొనాలనుకుంటే లక్షలు ఖర్చు అయ్యేవి. చైనా కంపనీ షియోమీ రంగంలోకి దిగాక ధరలు అన్ని దిగొచ్చాయి. రెడ్‌మీ పుణ్యమా అని 12 వేలకు కూడా 32 ఇంచుల టీవీ అందుబాటులోకి వచ్చింది. 43 అంగుళాల స్మార్ట్ టీవీని కూడా తక్కువ ధరకే దొరుకుతుంది. ఇక ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్'లో అయితే రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 43పై భారీ ఆఫర్ ఉంది. 

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 43 సేల్ భారత దేశంలో ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయింది. ఈ టీవీ అసలు ధర 42,999గా ఉండగా.. అమెజాన్‌లో 14 వేలను తగ్గించి రూ.28,999గా నిర్ణయించారు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈఎంఐ 1,365తో ఆరంభం కానుంది. ఎక్స్ చేంజ్ ఆఫర్ 5,430గా ఉంది. బ్యాంకు ఆఫర్స్, పాట్నర్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

అమెజాన్‌లో రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 43తో పాటుగా ఎక్స్ 50, ఎక్స్ 55, ఎక్స్ 65 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ 43లో 43 అంగుళాల డిస్‌ప్లేతో పాటు డాల్బీ విజన్, 30W స్పీకర్లు కూడా ఉన్నాయి. రెడ్‌మీ గతంలో లాంచ్ చేసిన స్మార్ట్ టీవీ 43లో 4కే ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇందులో మాత్రం హెచ్‌డీఆర్ సపోర్ట్ చేసే 4కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది.

ఎక్స్ 43లో డీటీఎస్ వర్చువల్ ఎక్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో మూడు హెచ్‌డీఎంఐ 2.1 స్లాట్లు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, ఆప్టికల్, 3.5 ఎంఎం జాక్ కూడా ఉన్నాయి. ఇక ఇందులో ఎలాంటి లోపాలు, డ్యామేజ్ ఉన్నా.. డెలివరీ అయిన 10 రోజులలోపు రిటర్న్ చేసే అవకాశం ఉంది. ఎక్స్ 43 టీవీపై 1 సంవత్సరం వారంటీ ఉంది. 

Also Read: Malaika Arora Trolls: అయ్యోరామ.. మలైకా అరోరా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా!!

Also Read: Amazon Sale: అమెజాన్ సేల్ అద్దిరిపోయే ఆఫర్స్.. వీటిపై 50% డిస్కౌంట్ సేల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News