Punjabi Actor Activist Deep Sidhu: నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పంజాబ్‌కు చెందిన ఈ ప్రముఖ నటుడు హర్యానాలోని సోనిపట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈయన మృతిని సోనిపట్ పోలీసులు ధృవీకరించారు.
ఢిల్లీ నుండి భటిండా వైపుగా కారులో దీప్ సిద్ధూ వెళ్తున్నాడు. హర్యానాలో సోనిపట్ వద్ద దీప్ సిద్ధూ కారు ఒక ట్రక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో దీప్ సిద్ధూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ డిస్ట్రిక్ట్‌కు చెందిన దీప్ సిద్ధూ.. లా చదివాడు. కొన్నాళ్లు మోడల్‌గా పని చేశాడు. అనంతరం పలు పంజాబీ మూవీల్లో నటించాడు. ఇక గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమానికి దీప్ సిద్ధూ మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే పరేడ్ పేరుతో చేపట్టిన ఆందోళనలో దీప్ సిద్ధూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనల్లో దీప్ సిద్ధూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Punjabi actor Deep Sidhu dies in a road accident near Sonipat in Haryana, confirms Sonipat Police. Details awaited.
He was also earlier named as an accused in the 2021 Red Fort violence case. pic.twitter.com/CoLh8ObkJJ
— ANI (@ANI) February 15, 2022
ఇక పలు దీప్ సిద్దూ సోని పిక్చర్స్, డిస్నీ వంటి వాటికి న్యాయ సేవలు కూడా అందించాడు. కొన్ని సినిమా సంస్థలకు లీగల్‌హెడ్‌గా ఆయన పని చేశాడు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా దీప్ సిద్దూ చుర్గా ఉండేవారు.
Also Read: Bheemla Nayak: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్- భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడు!
Also Read: Lassa fever : యూకేలో 'లస్సా ఫీవర్'తో ముగ్గురు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook