Budget 2022 News: నేటి నుంచి పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలు- విపక్షాల అస్త్రాలు రెడీ..!

Budget 2022 News: కొవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల నుడుమ నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 12:34 PM IST
  • నేటి నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు
  • కొవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు
  • తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం
  • నేడే పార్లమెంట్​ ముందుకు ఆర్థిక సర్వే 2022
Budget 2022 News: నేటి నుంచి పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలు- విపక్షాల అస్త్రాలు రెడీ..!

Budget 2022 News: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్​ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల నడుమ సమావేశాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే..

దేశంలో కరోనా విజృభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీలందరూ.. పార్లమెంట్​కు హాజరయ్యేందుకు ఆర్​టీ-పీసీఆర్​ నెగెటివ్​ రిపోర్ట్​ను, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్​ను తీసుకురావాల్సి ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల విభాగం ద్వారా తెలిసింది.

ఇక కరోనా భయాల నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే.
మొదటి దశ నేటి నుంచి (జనవరి 31) ఫిబ్రవరి 11 వరకు జరగనుంది.

రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనుంది. రెండో దశలో మార్చి 18న హోలీ సందర్భంగా సమావేశాలు జరగవు.

సమావేశాలు ఇలా..

తొలి రోజు రాజ్యసభ, లోక్​ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీరామన్​ ఆర్థిక సర్వే 2022ను ప్రవేశపెట్టే అవకాశముంది.

ఇక రెండో రోజు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.

విపక్షాల అస్త్రాలు సిద్ధం..

బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పెగాసస్​ వివాదం, రైతుల సమస్యలు, చైనాతో సరిహద్దు వివాదంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు విపక్షనేతలు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా 2017లోనే ఇజ్రాయెల్​నుంచి భారత్​ పెగాసస్​ స్పైవేర్​ను కొనుగోలు చేసిందని న్యూయార్క్​ టైమ్స్​ కథనం ప్రచురించిన తర్వాత విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్లయింది. ఈ అంశంపై విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి.

ప్రభుత్వం ఇప్పటికే గూఢచర్యం ఆరోపణలను తిరస్కరించినందున.. ప్రభుత్వంపై, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్​పై.. ప్రివిలేజ్​ మోషన్ ప్రవేశపెట్టేందుకు.. లోక్ సభ స్పీకర్​కు లేఖ రాశాలు కాంగ్రెస్​ లీడర్ అధిర్​ రంజన్ చౌదరి.

తొలి రెండు రోజులు జీరో అవర్ లేకుండానే..

బడ్జెట్​ సమావేశాల ప్రారంభ రోజు, బడ్జెట్​ రోజు జీరో అవర్​, ఉండదని గత శుక్రవారం విడుదల చేసిన పార్లమెంట్​ బులిటెన్​ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రసంగం కారణంగా.. 17వ లోక్​ సభ 8వ సెషన్​లో జనవరి 31న, ఫిబ్రవరి 1న 'జీరో అవసర్​' ఉండదు అని వెల్లడించింది.

'జీరో అవర్​'లో లేవనెత్తే అత్యవస ప్రజా ప్రాముఖ్యత అంశాలను ఫిబ్రవరి 2 నుంచి తీసకోన్నట్లు కూడా ఎంపీలకు వివరించింది పార్లమెంట్ వ్యవహారా విభాగం. అయితే ఇందుకోసం అత్యవసర అంశాలపై ఫిబ్రవరి 1 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ-పోర్టల్​ లేదా మాన్యువల్​గా పార్లమెంటరీ నోటీస్ ఆఫీసులో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

Also read: Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో వివిద ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Also read: Budget 2022 Expectations: బడ్జెట్ 2022లో ఆ నిర్ణయం ఉంటే.. పెరగనున్న టెక్​ హోం శాలరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News