India Covid 19 Cases Update: కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. భారత (India) దేశంలో కూడా కరోనా పంజా విసురుతోంది. మూడో దశలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా భయాందోళనలకు గురిచేస్తోంది. దేశంలో శుక్రవారం 2,35,532 కొత్త కొవిడ్ కేసులు (New Cases) నమోదు అయ్యాయి. ముందు రోజులతో పోల్చుకుంటే.. దాదాపు 17 వేల వరకు కొవిడ్ కేసులు తగ్గాయి. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం.
శుక్రవారం కరోనా కేసులు (Covid 19) తగ్గినా.. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 871 మంది మృత్యువాత పడ్డారు. గత రోజుతో పోల్చుకుంటే.. 200లకు పైగా ఎక్కువ. ఈ రెండేళ్లలో దాదాపుగా 5 లక్షల మంది కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పొయారు. శుక్రవారం 3,35,939 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 లక్షల ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: U19 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి పాజిటివ్! కెప్టెన్ ఎవరంటే?!!
India reports 2,35,532 new #COVID19 cases, 871 deaths and 3,35,939 recoveries in the last 24 hours
Active case: 20,04,333 (4.91%)
Daily positivity rate: 13.39%Total Vaccination : 1,65,04,87,260 pic.twitter.com/6X0dxg3LjJ
— ANI (@ANI) January 29, 2022
గురువారంతో పోలిచ్చుకుంటే శుక్రవారం కొవిడ్ (Covid 19) పాజిటివిటీ రేటు కాస్త తగ్గింది. 5.88 శాతం నుంచి 13.39 శాతానికి పాజివిటీ రేట్ తగ్గింది. ఆక్టివ్ కేసుల రేటు 4.9 శాతం పెరిగింది. దేశంలో శుక్రవారం నాటికీ 1,65,04,87,260 వాక్సినేషన్ పూర్తయింది. అయితే మహారాష్ట్ర, ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో పాజిటివిటీ రేట్ భారీగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాలు కరోనా నిబంధనలు చేపడుతున్నా.. కేసులు మాత్రం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
India Covid 19 Cases Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు!!
భారత దేశంలో కరోనా పంజా
స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారీగా పెరిగిన మరణాలు