Pakistan: ముర్రేలో భారీగా కురిసిన మంచు...వాహనాల్లో చిక్కుకొని 22 మంది మృతి!

Pakistan: పాక్ లో ఘోర దుర్ఘటన సంభవించింది. భారీగా మంచు కురువటంతో..వాహనాల్లో చిక్కుకొని 22 మంది మృత్యువాత పడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 11:24 AM IST
  • పాక్ లో ఘోర దుర్ఘటన
  • ముర్రేలో భారీ హిమపాతం
  • 22 మంది దుర్మరణం
Pakistan: ముర్రేలో భారీగా కురిసిన మంచు...వాహనాల్లో చిక్కుకొని 22 మంది మృతి!

Pakistan: పాకిస్తాన్ లో విపరీతమైన మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఆ దేశంలోని ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రేను (Murree Hills resort) మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం (Snowfall) ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది చిన్నారులు ఉండటం విశేషం. ఇస్లామాబాద్ కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బాల్ తోపాటు ఆయను కుటుంబీకులు ఉన్నారు. వీరంతా హిమపాతం నడుమ వాహనాల్లో చిక్కుకుపోయారు. శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ఊపిరాడక మరణించారు.

పంజాబ్‌ ప్రావిన్సులోని ప్రముఖ పర్యటక ప్రదేశం ముర్రే. ఇస్లామాబాద్‌కు (Islamabad) 45.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 8 డిగ్రీలకు పడిపోయాయి. ఇక్కడ కురుస్తున్న మంచును చూసేందుకు పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.  రావల్పిండి జిల్లాలోని ఈ పట్టణానికి వేల సంఖ్యలో వాహనాలు చేరుకోవడంతో అన్ని మార్గాలు స్తంభించిపోయాయి. 1,122 మంది ప్రయాణికులు రోడ్లపై చిక్కుకుపోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. వారికి స్థానికులు ఆహారం, దుప్పట్లు అందజేస్తున్నారు.

Also Read: China Landslides: చైనాలో విరిగిపడిన కొండచరియలు.. 14 మంది మృతి!

ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (PM Imran Khan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి ఉస్మాన్‌ బజ్దార్‌ ఆదేశాలు జారీ చేసినట్లు ‘'డాన్‌'’ పత్రిక పేర్కొంది. సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంది. ఈ ప్రాంతాన్ని ఒక్కరాత్రిలోనే నాలుగు అడుగుల మేర మంచుదుప్పటి కప్పేసిందన్నారు. ఇస్లామాబాద్‌ నుంచి ముర్రే వెళ్లే రహదారిని మూసివేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ రషీద్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News